ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి ఆయన పేరును తొలగించి… వైఎస్ఆర్ పేరు పెట్టడంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఆ స్పందన చూసి చాలా మందికి అది జూనియర్ ఎన్టీఆరేనా అన్న సంశయం వస్తోంది. ఎందుకంటే వైఎస్ఆర్ను ఎన్టీఆర్తో సమానంగా చేసేశారు జూనియర్. ఇద్దరూ సమాన స్థాయిలో గొప్ప నాయకులని ప్రశంసించేశారు. చనిపోయిన వాళ్లందరూ మంచోళ్లే అనే పద్దతిలో ఎన్టీఆర్ ప్రశసించించినా …ఎన్టీఆర్తో సమానం చేయడమే కాకుండా.. పేరు ఉంచితే ఉంచారు.. తీసేస్తే తీసేశారు.. దాని వల్ల ఆయన స్థాయి తగ్గదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఎన్టీఆర్ గురించి ఎలాంటి వ్యతిరేక కామెంట్ వచ్చినా తీవ్రంగా విరుచుకుపడాల్సిన స్థితిలో ఉండే ఎన్టీఆర్ ఇలాంటి పోస్ట్ పెట్టండ చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. గతంలో ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వైసీపీ నాయకులు కించ పర్చినప్పుడు కూడా ఇంతే తేడాగా స్పందించారు. కానీ అప్పట్లో ఆయన రాజకీయాల జోలికి రావడం లేదు కదా అని టీడీపీ నేతలు కూడా లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు రాజకీయానికి సంబంధం లేకపోయినా ఎన్టీఆర్ గురించి స్పందించాల్సి ఉంది.
కానీ అలా స్పందించలేదు సరి కదా.. పేరు మార్చడాన్ని సమర్థించినట్లుగా మాట్లాడారు. నిజానికి జగన్ చేసిన పనిని ఆయన చెల్లి షర్మిల ఖండించారు. అలా పేరు మార్చడం తప్పేనన్నారు. జగన్ సొంత చెల్లి.. ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్ కుమార్తె షర్మిలనే ఆ పని చేయడాన్ని తప్పు పట్టారు. కానీ ఎన్టీఆర్ కు ఏమైంది ? ఆమెకు లేని ఇబ్బంది ఎన్టీఆర్కు ఎందుకు ?. ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల్ని కలచి వేస్తున్న ప్రశ్న.