ఎన్టీఆర్- రామ్ చరణ్ మధ్య మంచి స్నేహం వుంది. కానీ బయట ప్రపంచానికి మాత్రం వారి స్నేహం గురించి తెలిసింది తక్కువ. హీరోలుగా చూసుకుంటే వీరిద్దరూ రెండు ద్రువాలు. ఒకరిది నందమూరి కుటుంబం, మరొకరిది మెగా కుటుంబం..ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తప్పితే ఎప్పుడూ కలసి నటించింది లేదు. కానీ వీరి మధ్య బలమైన స్నేహం ఎలా కుదిరింది ? ఇదే ప్రశ్న దర్శకుడు అనిల్ రావిపూడికి వచ్చింది. ప్రమోషన్స్ లో బాగంగా ఆర్ఆర్ఆర్ టీమ్ ని ఇంటర్వ్యూ చేశాడు అనిల్. ఈ సందర్భంగా చరణ్, ఎన్టీఆర్ ల స్నేహం ఎప్పుడు ఎలా మొదలైయిందని అడిగాడు. ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం ఇచ్చాడు.
” మేము ఇద్దరం భిన్న ద్రువాలం. భిన్న ద్రువాలు ఆకర్షించుకుంటాయనేది మా విషయంలో కూడా జరిగింది. అగ్ని పర్వతం బద్దలైపోతున్నా చాలా కామ్ గా వుండే క్యాలిటీ చరణ్ లో వుంది. ఆక్కడే చరణ్ కి అంటే ఇష్టం ఏర్పడింది. స్టార్ క్రికెట్ పోటీలు జరుగాయి. అప్పుడు నేను, చరణ్ కలసి వెళ్ళడం, మాట్లాడుకోవడం… ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడం.. అలా ఎవరికీ తెలియని ఒక బలమైన స్నేహం ఏర్పడింది. మా స్నేహం ఎంతలా అంటే .. మార్చ్ 26 మా ఆవిడ ప్రణతి బర్త్ డే. చరణ్ ది 27. మార్చ్ 26, 12గంటలు కొట్టిన వెంటనే చరణ్ కారు గేట్ దగ్గరికి రావడం, చరణ్ తో వెళ్లిపోవడం.. ఇలా బోలెడు పుట్టినరోజులు జరిగాయి. కానీ ఎవరికీ తెలీదు. మా ఆవిడ ఫోన్ చేసి ఎక్కడున్నారని అడుగుతుంది. మార్చ్ 26 అయిపోయింది కదా అని చెప్తా. పాపం చరణ్.. గేట్ దగ్గర ప్రణతి వుంటుందోమోనని భయపడుతుంటాడు” అని వారి స్నేహం గురించి చెప్పుకొచ్చాడు తారక్.