ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందా, ఉండదా? ఉంటే ఎప్పుడు? ఇలా అన్నీ ప్రశ్నలే. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కాంబినేషన్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. అదేంటంటే.. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో సినిమా తప్పకుండా ఉంటుందట. దీపావళి తరవాత ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. సినిమా మాత్రం వచ్చే యేడాది ఉండబోతోందట. పవన్ తో ఓ సినిమా చేయడానికి సన్నద్ధం అవుతున్నాడు త్రివిక్రమ్. అందుకు సంబంధించిన చర్చల్లో బిజీ బిజీగా ఉన్నాడు. పవన్‌తో సినిమా పూర్తయ్యాకే ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కిస్తానని త్రివిక్రమ్ చెప్పాడట. దానికి ఎన్టీఆర్ కూడా ఓకే అనేసినట్టు టాక్. ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ఇంకా కథేమీ అనుకోలేదని, అయితే.. ఎన్టీఆర్ సినిమా విషయంలో, అదెలా ఉంటే బాగుంటుందన్న విషయాల్లో తనకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయని అవన్నీ ఎన్టీఆర్‌తో పంచుకొన్నాడని తెలుస్తోంది. దీపావళి తరవాత అధికారిక ప్రకటన వచ్చినా.. సినిమా మాత్రం 2017లోనే అనేది స్పష్టమైంది. మధ్యలో.. మహేష్బాబుతోనూ త్రివిక్రమ్ ఓ సినిమా చేయాల్సివుంది. అది ఎన్టీఆర్ సినిమా తరవాతే అని తెలుస్తోంది. సో.. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబో పట్టాలెక్కడం ఖాయమన్నమాట. ఆ తీపి వార్త కోసం ఎదురుచూద్దాం.