ఎన్టీఆర్ మరో తన మంచి మనసు చాటుకున్నారు. అభిమాని చివరి కోరిక తీర్చారు. ఏపీకి చెందిన కౌశిక్ కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. కౌశిక్, ఎన్టీఆర్ వీరాభిమాని. తను చనిపోయేలోపు ‘దేవర’ చూడాలని కోరుకుంటున్నట్లు అతని తల్లిదండ్రులు ఇటీవల చెప్పారు.
సన్నిహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ తాజాగా కౌశిక్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడారు. అతడికి ధైర్యం చెప్పారు. ‘‘ధైర్యంగా కోలుకుని బయటకు రావాలి. ‘దేవర’ చూడాలి. సినిమా అనేది తర్వాత నువ్వు ముందు కోలుకుని రావాలి. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి’ అన్నారు.
‘‘అన్నా.. మిమ్మల్ని చూస్తానని అస్సలు అనుకోలేదు’’ అని కౌశిక్ అనగా.. ‘‘నేను మాట్లాడకపోతే ఎట్లా నీతో’’ అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. అధైర్య పడొద్దని, ఏ సాయ సహకారాలు ఉంటాయని, కోలుకున్న తర్వాత నేరుగా కలుస్తానని చెప్పారు ఎన్టీఆర్.