‘ఆర్ఆర్ఆర్’ తర్వాత విరామం తీసుకున్నారు ఎన్టీఆర్. ఇప్పుడాయన కొరటాల శివ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘జనతా గ్యారేజ్’ లాంటి హిట్ తర్వాత ఎన్టీఆర్ – కొరటాల కలయిక నుంచి వస్తున్న చిత్రం కావడంతో.. దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు వున్నాయి.
అలాగే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో కూడా ఎన్టీఆర్ ఒక సినిమా చేయాలి. ఉప్పెన తర్వాత ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తున్నాడు బుచ్చిబాబు. ఆ మధ్య కొరటాల శివ కథ విషయంలో కాస్త ఆలస్యం జరిగితే బుచ్చిబాబు సినిమానే ముందు చేయాలని కూడా చూశారు. ఇంతలో కొరటాల కథ పూర్తయింది. అయితే బుచ్చిబాబుని ఇంకా వెయిటింగ్ లో పెట్టడం ఇష్టం లేని ఎన్టీఆర్ జనవరి నుండి సినిమా ఆ సినిమా కూడా స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ కి, ఉప్పెన తర్వాత బుచ్చిబాబుకి చాలా గ్యాప్ వచ్చింది. దిన్ని భర్తీ చేయాలంటే రెండు సినిమాలు సమాంతరంగా చేయాలనే నిర్ణయానికి వచ్చారు ఎన్టీఆర్.