ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. జాన్వీ కపూర్ కథానాయిక. రేపు ఎన్టీఆర్ పుట్టన రోజు. ఈ సందర్భంగా ఇంకాసేపట్లో ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు. టైటిల్ కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకి `దేవర` అనే టైటిల్ ఖాయమైందని టాక్. పవన్ కల్యాణ్ – సాయిధరమ్ తేజ్‌ల చిత్రానికి `బ్రో` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఈ చిత్రం కోసం ముందు అనుకొన్న టైటిళ్లలో `దేవర` ఒకటి. ఇప్పుడు ఈ టైటిల్ ఎన్టీఆర్‌కి షిఫ్ట్ అయ్యింది. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని, ఫస్ట్ లుక్కుల్లో ఇది ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందని, ఇలాంటి లుక్ల ఎన్టీఆర్ ఎప్పుడూ కనిపించలేదని.. ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఆ లుక్ ఎలా ఉండబోతోందా? అని ఎన్టీఆర్ అభిమానులతో పాటు యావత్ తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తరవాత.. ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇదే. కాబట్టి అంచనాలు తారాస్థాయికి చేరాయి. అవి ఫస్ట్ లుక్ తో మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఆచార్య ఫ్లాప్‌తో కొరటాల గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలనుకొంటున్నాడు. అందుకే ఈ స్క్రిప్టు కోసం బాగా కష్టపడ్డాడు. మరి అవుట్ పుట్ ఎలా ఉంటుందో చూడాలి.