ఇల్లు లేదా ఇంటి స్థలం కొనుగోలు కోనుగోలు కోసం ఓటీపీ అంటే వన్ టైం ఇన్వెస్ట్ మెంట్ మంచిదా కాదా అన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాయి. డబ్బులు ఉంటే అప్పులు చేయడం ఎందుకని చాలా మంది అనుకుంటారు. కానీ అక్కడే అసలు పెట్టుబడి చిట్కాలు ఉంటాయి. చాలా మంది చేతిలో డబ్బులు ఉన్నప్పటికీ లోన్ ద్వారానే ఆస్తులు కొనుగోలు చేస్తూంటారు. తమ వద్ద ఉన్న డబ్బుల్ని అధిక రాబడి వచ్చే దాంట్లో పెట్టుబడులుగా పెట్టి.. తక్కువ వడ్డీ రేటు ద్వారా ఆస్తుల్ని కొనుగోలు చేస్తారు. దీని ద్వారా రెండు విధాలుగా లాభాలు ఉంటాయి.
బిల్డర్లు ఒకేసారి పూర్తి చెల్లింపు చేసే కొనుగోలుదారులకు గణనీయమైన డిస్కౌంట్లు, ఆఫర్లు ఇస్తూంటారు. పూర్తి చెల్లింపు వల్ల ఆస్తి రిజిస్ట్రేషన్ బదిలీ ప్రక్రియ త్వరగా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ ధరలు వేగంగా పెరుగుతాయి కాబట్టి ధరల పెరుగుదల నుండి లాభం పొందే అవకాశాలు ఉంటాయి. కానీ వన్ టైమ్ పేమెంట్ ఆఫర్లు ఇచ్చేవారితో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మోసాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తక్కువకే ఇస్తామని… రేట్లు పెరుగుతున్నాయని చెప్పి అంటగట్టడానికి ప్రయత్నిస్తారు.
అలాగే ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసేటప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధి మర్థ్యాన్ని అంచనా వేయాలి. వచ్చే ఐదేళ్లు లేదా పదేళ్లు ఎలా ఆ ప్రాంతం వృద్ధి చెందుతుందా అన్నది ఆలోచించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో బడా కంపెనీలు అన్నీ వన్ టైమ్ పేమెంట్ నుప్రోత్సహిస్తాయి. ఆఫర్లు కూడా ఇస్తాయి. కొత్త ప్రాజెక్టుల లాంచ్ సమయంలో ఎక్కువగా ఇస్తారు. అంటే నిర్మాణం ప్రారంభం కాక ముందే అమ్మేస్తారు. ఇలాంటి వాటి విషయంలో అన్ని ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి.
తక్కువకు వస్తున్నాయని ఓటీపీ ఆఫర్‌తో ఇల్లు లేదా స్థలం కనుగోలు చేయడం తొందరపాటు నిర్ణయం అవుతుంది. అన్నీ సరి చూసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి.