రేవంత్ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ ఘోరంగగా ఉందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. లోటస్ పాండ్‌లో ఫుట్ పాత్ ఆక్రమించేసి కట్టిన షెడ్లను తొలగించిన అధికారిని బదిలీ చేయడంతో ఆక్రమణలు తొలగించడం కూడా తప్పేనా అన్న చర్చ ప్రజల్లో ప్రారంభమయింది. అది ఎవరిదైనా కావొచ్చు.. కానీ చాలా పక్కగా ఫుట్ పాత్ మీద కట్టినట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ చుట్టుపక్కల వారికి తీవ్ర అసౌకర్యం కల్పిస్తున్నాయి. ఫిర్యాదులు వచ్చాయి. స్వయంగా ఓ మంత్రి కూల్చివేతకు ఆదేశాలిచ్చారు. అయినా తమ అంతర్గత రాజకీయాల కారణంగా ఓ ఆఫీసర్‌ను బదిలీ చేశారు.
నియమ నిబంధనలకు విరుద్ద్ధంగా.. మునిసిపల్ అధికారుల నుంచి ఏలాంటి అనుమతులు లేకుండా రోడ్డును ఆనుకుని చేపట్టిన షెడ్లను తొలగించినందుకు అధికారికి బదిలీని బహుమతిగా ఇస్తారా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో వస్తోంది. ఆక్రమిత భూమిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటే.. అది కూడా ఫిర్యాదు మేరకు చర్యలు చేపడితే.. అధికారిని బలి చేయడం విస్మయానికి గురి చేస్తోది. నియమాలను అమలు చేయాలని చెప్పేది అధికారులే& నియమ నిబంధనలు, అధికారుల ఉత్తర్వులు, ప్రభుత్వ ఆదేశాలను అమలుచేస్తే.. అధికారులపై వేటు వేయడం బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్ కు సంకేతాలంటున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా వెలిసే నిర్మాణాలపై.. రోడ్డు ఆక్రమణల్లోని షెడ్లు, పలురకాల కట్టడాలు వంటి వాటిని కూల్చేసే అధికారాలు జోనల్ కమిషనర్ కు ఉంటాయి. కొత్త మునిసిపల్ చట్టం2019 ప్రకారం ఏలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టవచ్చు. అందుకు అయ్యే ఖర్చును కూడా నిర్మాణాదారుల నుంచి వసూలు చేయవచ్చని మునిసిపల్ చట్టం2019లో స్పష్టంగా ఉంది. ప్రజల్లో పలుచన అయ్యేలా తీసుకుంటున్న నిర్ణయాలు రేవంత్ సర్కార్ కు ఇబ్బందికరమే.