విడదల రజనీపై రేపోమాపో ఏసీబీ కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓ మాఫియాగా మారి.. చిలుకలూరిపేటలో వ్యాపారులను బెదిరింది దోచుకున్న వ్యవహారాల్లో ఆమె పాత్ర ఆధారాలతో సహా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పది మందికిపైగా ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ దర్యాప్తులో డబ్బులు ఎలా తీసుకున్నారో కూడా తేలింది. విడదల రజనీ మరిది గోపీ కలెక్షన్ కింగ్ గా గుర్తించారు. ఇప్పటికే కేసులు పెట్టడానికి అవసరమైన సరంజామానా రెడీ చేశారు. రెండు రోజుల్లో కేసుల ప్రక్రియ పూర్తి అయిపోతుంది.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. బెదిరించిన అధికారులే అప్రూవర్లుగా మారడం. జాషువా అనే పోలీసు ఆఫీసర్ ను.. ఓ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించడానికి ఉపయోగిచుకున్నారు. పెద్ద ఎత్తున ఫైన్ వేసినట్లుగా నటించడం.. డబ్బులు డిమాండ్ చేయడం..వసూలు చేయడం.. ఇవ్వకపోతే కేసులు పెట్టి లోపలేస్తామని బెదిరించడం వంటిపనులను జాషువా అనే పోలీసు అధికారితో పోటు మరికొందరితో చేయించారు. వీరంతా ఇప్పుడు అప్రూవర్లుగా మారారు. విడదల రజనీ చెప్పినట్లుగా చేశామన్నారు.
మొదటి సారి ఎమ్మెల్యే అయినా చివరి రెండున్నరేళ్లు మంత్రిగా ఉన్న ఆమె.. నియోజకవర్గాన్ని పీల్చి పిప్పి చేశారు. ఎవరు ఏ చిన్న వ్యాపారం చేసినా వదిలి పెట్టలేదు. ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో చిలుకలూరిపేట నుంచి మార్చేశారు. అయినా ఆమెకు ఓటమి తప్పలేదు. మరోసారి ఇటీవల చిలుకలూరిపేటకే ఇంచార్జ్ గా నియమించారు. కానీ చేసిన కలెక్షన్ల నిర్వాకం వెలులోకి వస్తోంది. కేసుల పాలవడం ఖాయంగా కనిపిస్తోంది.