ఆఫీసర్లు ఎవరైనా సరిగ్గా పని చేయకపోతే ప్రభుత్వాధినేత ఏం చేస్తారు ?. మహా ఆయితే బీపీ తెచ్చుకుని అరుస్తారు.. ఇంకా కోపం వస్తే.. సస్పెండ్ చేస్తారు. అది ప్రజాస్వామ్యంలో జరిగేది. కానీ నియంతృత్వంలో మాత్రం… అదేమీ ఉండదు.. నేరుగా ఉరి తీసేయడమే. ఉత్తరకొరియా నియంత పాలకుడు కిమ్ అదే చేశారు.
ఉత్తరకొరియాలో ఇటీవల వరదలు వచ్చాయి. ఆ వరదలు అసాధారణంగా వచ్చాయి. మన బెజవాడకు వచ్చిన వరదల కంటే వంద రెట్లు ఎక్కువ. ఆ వరదల్లో చాలా మంది చనిపోయారు. కిమ్ కూడా ఫీలయ్యాడు. విమర్శించేంత ధైర్యం ఎవరికీ లేకపోయినా ఈ మధ్య ఎందుకో… ప్రజలకు కష్టాలు వస్తే.. స్పందించాలని అనుకుంటున్నారు. అలా వరదల్లో పర్యటించారు కూడా. చివరికి ఆయనకు ఇందులో ఎవరో ఒకర్ని బలి చేయాల్సిందేనని డిసైడయ్యారు. చివరికి వరదల్ని ఆపలేకపోయారని నిందవేస్తూ.. ముఫ్పై మంది అధికారుల్ని కారణంగా తేల్చారు.
మాములుగా అయితే వారిని ఉద్యోగంలో నుంచి తీసేయడమే క్యాపిటల్ పనిష్మెంట్. కానీ అసలైన క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చేశారు. అంటే ఉరి తీయించేశారు. ఏకంగా ముఫ్పై మందిని ఉరి తీయించేసి… దానికి కారణంగా వరదల నుంచి ప్రజల్ని కాపాడలేకపోయారని నిందను ప్రజలకు చెప్పారు. చెప్పకపోయినా నష్టం ఏమీ లేదు. ఎందుకంటే.. అక్కడ … కిమ్ కు వ్యతిరేకంగా ఎవరు నోరెత్తినా అదే గతి పడుతుంది మరి.