ఫిన్టెక్ సదస్సులో.. పెట్టుబడుల హడావుడిలో ఉన్న పారిశ్రామికవేత్తలకు వెన్నులో వణుకు పుట్టించేలా… ఐటీ అధికారులు… పదుల సంఖ్యలో.. విశాఖలో హడావుడి చేస్తున్నారు. నిన్న రాత్రే ఐదు రాష్ట్రాల నుంచి… విశాఖకు చేరుకున్న ఐటీ అధికారులు ఉదయమే… సోదాలు ప్రారంభించారు. ఎంవీపీ కాలనీలోని ఐటీ కార్యాలయం వద్ద.. ఏకంగా యాభై వాహనాలను రెడీ చేశారు. ఉదయమే కొన్ని వాహనాల్లో కొంత మంది సోదాలకు వెళ్లారు. గాజువాక మం. దువ్వాడ ఎస్ఈజడ్లో ఐటీ అధికారుల సోదాలు చేస్తున్నారు. ట్రాన్స్ వరల్డ్ బీచ్ శాండ్ కంపెనీలోనూ తనిఖీలు చేస్తున్నారు. దువ్వాడలోని టీజీఐ కంపెనీలోనూ తనిఖీలు చేస్తున్నారు.
విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగరాల్లోనూ పెద్ద సంఖ్యలో ఐటీ బృందాలు మోహరించాయి. ప్రధాన కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాయి. విశాఖపట్నం సోదాలకు అనుబంధంగా ఆయా నగరాల్లో ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే.. విజయవాడ కేంద్రం ఐటీ దాడులు నిర్వహించారు. కేవలం తెలుగుదేశం పార్టీ నేతలపైనే ఐటీ దాడులు జరిగాయి. ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు, టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడులు చేశారు. అయితే.. తమకు ఏం దొరికిందన్నదానిపై వివరాలు బయటపెట్టలేదు .
కానీ.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాత్రం.. ఐటీ శాఖ మాస్టర్ మైండ్ తానేనన్నట్లు మీడియా ముందుక వచ్చి… వాళ్ల ఇంట్లో ఫలనావి దొరికాయి అంటూ .. ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు… ఎవర్నీ టార్గెట్ చేశారన్నదానిపై.. ఇంకా క్లారిటీ రాలేదు. కానీ.. రాజకీయ నేతల్ని.. వారి సన్నిహితులనే టార్గెట్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై.. కాసేపట్లో.. క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.