ప‌వ‌న్ ‘గ్లాసు’ వ‌ద‌ల్లేదు!

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటు రాజ‌కీయాలూ, అటు సినిమాలూల అంటూ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. సినిమాల్లో అప్పుడ‌ప్పుడూ పొలిటిక‌ల్ పంచ్‌లు ఇస్తూ, రెండింటికీ న్యాయం చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ‘జ‌న‌సేన‌’ గుర్తు గాజు గ్లాసుని ఆయ‌న ఎల్ల‌వేళ‌లా ప్ర‌మోట్ చేయ‌డానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఆయ‌న సినిమాల్లో గాజు గ్లాసు సీన్ ఒక‌టైనా ఉంటుంది. తాజాగా ‘ఓజీ’ కొత్త పోస్ట‌ర్ వచ్చింది. రెట్రో లుక్ లో ప‌వ‌న్ అద‌ర‌గొట్టేశాడు. చేతిలో గాజు గ్లాసు ఉండ‌డం ప‌వ‌న్ అభిమానుల‌కు మ‌రింత న‌చ్చేలా ఉంది. ప్రస్తుతం ఈ స్టిల్ బాగా వైర‌ల్ అవుతోంది.

అన్న‌ట్టు ‘ఓజీ’ రిలీజ్ డేట్ కూడా ఇప్పుడు అధికారికంగా ప్ర‌కటించారు. సెప్టెంబ‌రు 27న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ‘అత్తారింటికి దారేది’ సెప్టెంబ‌రు 27నే విడుద‌లైంది. అప్ప‌టికి ఆ సినిమా ప‌వ‌న్ క‌ల్యాణ్ పాత రికార్డుల్నీ తిర‌గ‌రాసి, ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగులో తొలి వంద కోట్ల సినిమాల్లో అదొక‌టి. ఇప్పుడు అదే డేట్ కి `ఓజీ`ని తీసుకొస్తున్నారు. మొత్తానికి గ‌త కొంత కాలంగా సినిమాల ప‌రంగా ప‌వ‌న్ నుంచి ఎలాంటి అప్ డేటూ రాలేదు. ‘ఓజీ’ రిలీజ్ డేట్ తో.. ఆ లోటు కాస్త తీరింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close