సుహాస్ తన ఇమేజ్ తగ్గ కథలు ప్రయత్నిస్తున్నాడు. అంబాజీ పేట, ప్రసన్న వదనం, జనక అయితే ఈ మూడు కూడా దేనికవే భిన్నమైన సినిమాలు. అయితే ఈ మూడు సినిమాల నుంచి ఆశించిన విజయం రాలేదు. ఇప్పుడు రామ్ గోధాల దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. అదే ఓ భామ అయ్యో రామ. మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటించింది.
తాజాగా టీజర్ ని వదిలారు. అమ్మాయి క్యారెక్టర్ ని హైలెట్ చేస్తూ రాసుకున్న కథ ఇది. ఇందులో అమ్మాయి పాత్ర కాస్త వింతగా కనిపించిందిద. ఆమెది రక్తచరిత్ర, చంద్రముఖి తరహా పాత్ర. అలాంటి క్యారెక్టర్ తో అమాయకుడైన హీరో ప్రయాణం ఏమిటనేది మిగతా సినిమా.
టీజర్ వరకూ బాగానే వుంది. ఫన్ బాగానే వర్కవుట్ అయినట్టు కనిపిస్తెంది. సుహాస్ ఇమేజ్‌కు, వయసుకు, స్టైల్‌కి తగిన పాత్ర ఇది. అయితే ఇందులో బాహుబలి చంద్రముఖి తరహ సెట్ వర్క్ వుంది. ఆ విజువల్స్ కీ ఈ కథకీ ఎలాంటి సంబంధం ఉందో చూడాలి. విజువల్స్ ఓకే అనిపిస్తున్నాయి. టెక్నికల్ టీమ్ కూడా బాగా సపోర్ట్ చేసినట్టు కనిపిస్తోంది. ‘అమ్మాయిలని నమ్మొద్దు బాబు’అంటూ సుహాస్ వేడుకోవడం టీజర్ లో కొసమెరుపు. ఈ సమ్మర్ లోనే సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.