రాజుగారి గదితో దర్శకుడిగా తనకంటూ కొంత పేరు తెచ్చుకున్నాడు ఓంకార్. ఆ వెంటనే నాగార్జునని ఒప్పించి రాజుగారి గది 2 తీశాడు. రాజుగారి గది 3కీ మంచి ఫ్లాట్ ఫామ్ దొరికింది. ఈ సినిమాలో నాగార్జున స్థాయి ఉన్న నటుడ్ని ఎవరినైనా తీసుకోవొచ్చు. కానీ తన తమ్ముడి కోసం ఆ ఛాయిస్‌ని పక్కన పెట్టాడు. తమన్నాని తీసుకొచ్చి ‘రాజుగారి గది3’ క్రేజ్ పెంచాలని చూశాడు. కానీ తమన్నా హ్యాండివ్వడంతో, అవికాగోర్‌తో సర్దుకుపోయాడు. ఇదంతా తమ్ముడు అశ్విన్‌బాబు కోసమే. ఈ సినిమా హిట్టయితే, ఆ క్రెడిట్ తమ్ముడికీ దక్కాలని, ఆ హిట్టుతో తమ్ముడికి ఇంకొన్ని అవకాశాలు రావాలన్నది ఓంకార్ ఆశ. అయితే… రాజుగారి గది 2కి ఉన్నంత క్రేజ్, ఈసినిమాకి రాలేదు. దానికి కారణం.. ఇందులో స్టార్ వాల్యూ తగ్గడమే. రాజుగారి గదిని మించిన స్టార్ డమ్.. పార్ట్ 2లో కనిపించింది. అంతకు మించి పార్ట్ 3 ఉండాలి. కానీ.. కేవలం తమ్ముడికి క్రెడిట్ దక్కాలన్న ఉద్దేశంతో ఈసినిమా కోసం స్టార్ ల జోలికి వెళ్లలేదు. మరి ఓంకార్ త్యాగం ఏ మేరకు ఫలిస్తుందో తెలియాలంటే శుక్రవారం వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే రాజుగారి గది 3 వచ్చేది అప్పుడే.