గత ఐదు రోజులుగా.. పెట్రోల్, డీజిల్ ధరను.. సగటున రోజుకు..పావలా చొప్పున పెంచుకుంటూ పోతున్నారు. కరోనా కారణంగా అంతర్జాతీయంగా డిమాండ్ పడిపోయింది. రేట్లు కూడా… భారీగా ఏమీ పెరగడం లేదు. కానీ కేంద్రం.. మాత్రం.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోలింగ్.. కౌంటింగ్ పూర్తయిన తర్వాత మళ్లీ బాదుడు ప్రారంభించింది. దేశంలో ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారు. ఓ వైపు కరోనాను కట్టడిచేయలేని కేంద్రం ప్రజల్ని ఆంక్షల పేరుతో పనుల్లేకుండా ఖాళీగా కూర్చోబెడుతోంది. అదేసమయంలో.. రేట్ల బాదుడు మాత్రం వదిలి పెట్టడం లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచితే.. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. అయినా కేంద్రం మాత్రం.. రేట్లు పెంచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తోంది.
కేంద్రం అధికారికంగా తెలిపిన సమాచరం ప్రకారం. గత ఆర్థిక సంవత్సరం చివరి పది నెలల్లో రూ. రెండు లక్షల 94వేల కోట్ల పెట్రో పన్ను వసూలు చేసుకుంది. ఒక్క లీటర్ పెట్రోల్‌పై రూ. 34 వరకూ కేంద్రం వసూలు చేస్తోంది. డీజిల్‌పై రూ.32వరకూ పన్ను వసూలు చేస్తోంది. అంటే. సెస్సులు అదనం. రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ అదనం. వారు వేసే అదనపు పన్నులు ఎక్స్ట్రా. ఇవన్నీ చూస్తే.. అసలు లీటర్ పెట్రోల్ ధర. రూ. 30 కూడా ఉండదు. అన్నీ ప్రభుత్వాలు ఇంతే వసూలు చేయలేదు. ఒక్క బీజేపీ సర్కారే ఈ తాట తీసేంత వసూళ్లు చేస్తోంది.లెక్కన పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 53 శాతం పన్నుల వాటానే ఉంటోంది. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా కష్టాలు పడుతున్నా.. వారి ఆదాయం పెంపు కోసం ఎలాంటిప్రయత్నాలు చేయని ప్రభుత్వం పెట్రో పన్నులు మాత్రం నిరాటంకంగా కొనసాగిస్తున్నాయి.
ఇన్ని పన్నులు వసూలు చేస్తున్నా… ప్రజలకు టీకా కూడా గ్యారంటీ లేకుండా పోయింది. ఇతర రాష్ట్రాల్లో ప్రజలు.. ఇండియా కన్నా ఆర్థికంగా వెనుకబడిన దేశాలు… టీకా విషయంలో స్పష్టమైన మార్గదర్శకత్వంతో.. ఇళ్లకే వెళ్లి టీకాలు వేయించి ప్రజల్ని కాపాడుకుకున్నారు. కానీ ఇండియాలో రెగ్యులర్‌గా… పన్నులు పెంచుకుంటూ… పీల్చి పిప్పి చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ… మరే ఇతర బాధ్యతలు పట్టడం లేదు.