పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి వ్యక్తులపై నిఘా పెట్టారా లేదా అన్న అంశంపై తేల్చేందుకు గత అసెంబ్లీ సమావేశాల్లో నియమించిన హౌస్ కమిటీ అసలు పెగాసస్ గురించి ఏమీ చెప్పలేదు కానీ గత ప్రభుత్వం డేటా చోరీ చేసిందని ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గతంలో హైదరాబాద్లో డేటా చోరీ పేరుతో చేసిన హడావుడి కేసులో వివరాలనే అసెంబ్లీలో వెల్లడించారు. స్టేట్ డేటా సెంటర్ ఉండాల్సిన సమాచారాన్ని తెలుగు దేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులకు నేరుగా ఆ సమాచారాన్ని పంపించారని తెలిపారు. తద్వారా వారు ప్రత్యేక లబ్ధి చేకూర్చుకున్నారని … వైసీపీకి ఓట్లేయాల్సిన 30 లక్షల మంది ఓట్లు తొలగించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
నిజానికి ఈ ఆరోపణలను అప్పట్లోనే ఈసీ తోసి పుచ్చింది. ఎవరు పడితే వారు యాప్ల ద్వారా ఓట్లను తొలగించలేరని స్పష్టం చేసింది. అదే సమయంలో ఎలాంటి ఓట్లు తొలగించలేదని తెలిపింది. ఆధార్ కూడా అసలు ఆధార్ నెంబర్ సేకరించినంత మాత్రాన ఇతర వివరాలు తెలియవని.. డేటా చౌర్యం జరిగే అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే ఆవే ఆరోపణలు ఇప్పుడు హౌస్ కమిటీ చేసింది. కొసమెరుపేమిటంటే అసలు ఈ కమిటీని నియమించడానికి మమతా బెనర్జీ వ్యాఖ్యలు కారణం. అయితే అసలు అదంతా వదిలేసి పాత ఆరోపణలు చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారు.
అయితే ఇదే నిజం అయితే.. ఇప్పుడు అసెంబ్లీ.. డేటాను ఎలా టీడీపీ కి ఇచ్చారు… ఎవరు ఇచ్చారు.. ఇలా మొత్తం నేరాన్ని బయట పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇది ప్రాథమిక నివేదికే అని చెప్పడం ద్వారా ఆధారాలు బయట పెట్టకుడంా ఊరక ఆరోపణలు చేస్తే చాలన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందన్న ఆరోపణలు టీడీపీ వైపు నుంచి వస్తున్నాయి.