నేమ్‌లో నేముంది? అనుకోరు. నేమ్ లోనే సమస్తమ్ ఉంది అని భావిస్తుంటారు సినీ జనాలు. టైటిల్ ని ఎరవేసి జనాల్ని థియేటర్లకు రప్పించడం ఎలాగో వాళ్లకు బాగా తెలుసు. చిత్ర విచిత్రమైన టైటిళ్లు పెట్టి – ఆకర్షిస్తుంటారు. కాదేదీ టైటిల్‌కి అనర్హం అన్నట్టు… టైటిళ్లు వరదలా పారుతుంటాయి. `ఇది కూడా టైటిలేనా?` అని ఇప్పుడు మనం ముక్కున వేలేసుకోవాల్సివస్తోంది. ఇప్పుడొస్తున్న కొత్త టైటిళ్లు చూస్తే.. నవ్వొస్తుంటుంది. అయితే ఈ పరిస్థితి ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఉంది.
ఉదాహరణకు 1982 లో కొన్ని తమాషా టైటిళ్లు వచ్చాయి. వాటిలో ఎన్ని సినిమాలుగా రూపొందాయో తెలీదు గానీ.. నిర్మాణ సంస్థలు టైటిళ్లని రిజిస్టర్ చేయించాయి. వాటిలో గమ్మత్తైన సినిమా పేర్లని విజయ సినీ వార పత్రికలో ప్రచురించారు. వాటిలో కొన్ని మీకిలా గుర్తు చేస్తున్నాం.
* బియ్యంలో రాయి – పప్పులో కాలు
* ఎండలో రాముడు – నీడలో సీత
* నా పేరు బికారి
* సాని కొంప
* చిందుల చిదంబరం
* పాలకొల్లు పాపమ్మ
* కృష్ణా జిల్లా కుర్రాడు
* రచ్చ బండ పగిలింది
* నీ తల్లీ ఒక ఆడదే
* తల్లి కట్టిన తాళి బొట్టు
* నారాయణమ్మ మొగుడెవరు?
* నాకసి తీరాలి
* ఎవరికీ తలవంచకు – ఇలా సాగాయి ఆ టైటిళ్లు. ఇప్పుడు వీటిని వాడుకుంటే ఎలా ఉంటుందో కదూ..?