హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి గుంటూరు జిల్లాకు చెందిన ఒక మహిళ కోటి రూపాయల విరాళం ఇచ్చి సంచలనం సృష్టించారు. తక్కెళ్ళపాడుకు చెందిన స్వరాజ్యం అనే ఆ వృద్ధురాలు ఇప్పటికే ఆ మొత్తాన్ని బ్యాంక్‌లో వేసి ఉంచారు. దానికి సంబంధించిన చెక్‌ను ఆమె త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేయనున్నారు. తెలుగుజాతి గర్వపడేలా రాజధానిని నిర్మించటం అభినందనీయమని అన్నారు. చంద్రబాబు కృషిని అభినందిస్తున్నానని చెప్పారు.
గతనెలలో గుంటూరు జిల్లాలోనే తెనాలి పట్టణంలో ఒక వృద్ధురాలు తన సేవింగ్స్నుంచి రు.2 లక్షల రూపాయలను రాజధాని నిర్మాణానికిగానూ చంద్రబాబు నాయుడుకు అందజేసిన సంగతి తెలిసిందే. ప్రజలకు, ఫోటోలకు కనిపించటానికి కూడా ఆమె నిరాకరించారు. ఆమె ఉదార స్వాభావానికి కదలిపోయిన ముఖ్యమంత్రి ఆమెకు పాదాభివందనం కూడా చేశారు.