చిత్తూరు జిల్లాలో ఓంప్రతాప్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం రాజకీయ దుమారం రేపుతోంది. వైసీపీ నేతల వేధింపుల వల్ల ఆ యువకుడు ప్రాణం తీసుకున్నాడని విపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరు గ్రామం దళితవాడకు చెందిన ఓంప్రతాప్.. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో నడుపుతూ జీవనం సాగించే ఓంప్రతాప్కు మద్యం అలవాటు ఉంది. ఏపీ ప్రభుత్వ కొత్త విధానం ఓంప్రతాప్కు భారంగా మారింది. మద్యం కొనడానికి అప్పులు చేయాల్సి వస్తోందని…ఆవేదన చెందేవాడు. నాలుగు రోజుల కిందట.. మద్యం దుకాణం ముదు ఇలానే.. ఓ బాటిల్ కొనుక్కుని తర్వాత… ప్రభుత్వం తన వద్ద డబ్బు దోచుకుంటోందని ఆవేశపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిట్టారు. దాన్ని వీడియో తీసిన కొంత మంది సోషల్ మీడియాలో పెట్టారు..
ఓంప్రతాప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హఠాత్తుగా ఓంప్రతాప్ చనిపోయాడు. వైసీపీ నేతలు… పోలీసులు బెదిరించారని.. ఎక్కడ తనను చంపేస్తారోనన్న భయంతో.. ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నాడని విపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఓం ప్రకాష్ మరణంపై విచారణ జరిపించాలని…నారాలోకేష్ డిమాండ్ చేశారు. దళితులపై జగన్ ప్రభుత్వ దాష్టీకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఓటేసిన వారినే జగన్ కాటేస్తున్నారని .. వైసీపీ నేతల బెదిరింపులు, పోలీసుల వేధింపులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. పుంగనూరులో వైసీపీ నేతల వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న.. దళిత యువకుడి ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతలకు పోలీసులు వత్తాసు పలకడంతో.. ఇష్టారాజ్యంగా దళితులపై దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే కుటుంబసభ్యులు మాత్రం ఓం ప్రతాప్ అనారోగ్యంతో చనిపోయాడని.. ఎవరూ బెదిరించలేదని చెప్పడం ప్రారంభించారు. తాము కూడా వైసీపీకి చెందిన వ్యక్తులమేనని అంటున్నారు.
మద్యానికి అలవాటు పడిన వారందరిలోనూ.. ఓం ప్రతాప్ వ్యక్తం చేసిన తరహా ఆగ్రహమే కనిపిస్తోంది. ఊరూపేరూ లేని బ్రాండ్లు అమ్మడమే కాదు..వాటిని రెండింతలు,మూడితంల ధరలకు అమ్ముతూ పేదల్ని దోచుకుంటున్నారు. మద్యం దుకాణాల వద్ద చాలా మంది ఓంప్రతాప్ తరహా భాషనే ఉపయోగిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కాకపోతే.. ఓం ప్రకాష్ .. మాటలను వీడియో తీసి.. సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ కారణంగా ప్రాణం పోగొట్టుకోవాల్సి వచ్చిందని అంటున్నారు.