సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల వరుస సవాళ్ళు విసిరి నవ్వులపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు మరోసారి అభాసుపాలు అయ్యారు. రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీ పోలీసులు నోటిసులు ఇచ్చారని, ఆలస్యం చేయకుండా రేవంత్ ను అరెస్ట్ చేయాలని, లేదంటే బీజేపీ – కాంగ్రెస్ మధ్య ఒప్పందం ఉన్నట్లేనని వ్యాఖ్యానించి ప్రజల్లో మరోసారి పలుచన అయ్యారు.
వాస్తవానికి రిజర్వేషన్ల విషయంపై రేవంత్ కు నోటిసులు అందలేదు. కాంగ్రెస్ సోషల్ మీడియా టీంకు మాత్రమే నోటిసులు అందాయి కానీ, మీడియాలో రేవంత్ కు నోటిసులు అందాయని ప్రచారం జరగడంతో వెనకా, ముందు ఆలోచించకుండానే హరీష్.. వెంటనే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
సోషల్ మీడియాకు సంబంధించి నమోదయ్యే ఐటీ కేసులు నిలబడేవి కావు..చిన్న కేసులు ఇవి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న హరీష్ రావుకు ఈ విషయం తెలియనిది కాదు. అయినా.. ఢిల్లీ పోలిసులు కాంగ్రెస్ సోషల్ మీడియా టీంకు నోటిసులు ఇస్తే వాటిని రేవంత్ కు ఇచ్చారనుకొని రేవంత్ ని అరెస్ట్ చేయాలనడం ఆయన రాక్షాసానందనికి నిదర్శనమని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
ఆలస్యంగా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కేసీఆర్ బస్సుయాత్రకు వస్తోన్న ఆదరణను ఓర్వలేక బీజేపీ – కాంగ్రెస్ లు రిజర్వేషన్ల పేరిట డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని సోషల్ మీడియా క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది.