విజయసాయిరెడ్డి చేసింది తప్పుడు పనులు. దాన్ని ఆయన సమర్థించుకోవడానికి ఆయన మాట్లాడే మాటలు కులాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దొరికిపోయాక తనను పట్టుకున్న ఆ కులపోడే అని ఏడిస్తే ఎంత సిల్లిగా ఉంటుందో విజయసాయిరెడ్డి అదే చేస్తారు. అధికారంలో ఉన్నంత కాలం ఓ కులం మీద ఏడ్చారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా అదే చేస్తున్నారు. కానీ అప్పట్లో నోరు మెదపని ఆ కులపోళ్లు ఇప్పుడు విజయసాయిరెడ్డి మీద కోపం తెచ్చుకుంటున్నారు. నేరుగా ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ సలహాదారుగా ఐదేళ్లు సీఎంవోలో చక్రం తిప్పిన ఎస్. రాజీవ్ కృష్ణ .. విజయసాయి రెడ్డిపై మండి పడుతూ ఓ ట్వీట్ పెట్టారు. మీపై వచ్చిన వ్యక్తిగత ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాలి కానీ ఓ కులాన్ని ఎందుకు తిడుతున్నారని ఆయన ప్రశ్నించారు. వైసీపీలోనూ ఆ కులానికి చెందిన నేతలుననారని.. మీ ఉద్దేశం ప్రకారం ఎవరూ ఆ కులపోళ్లు ఎవరూ వైసీపీలో ఉండకూడదా అని ప్రశ్నించారు. ఇలా కులాల్ని తిట్టి ద్వేషించిన పార్టీ గెలిచిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అందరూ ఆదరిస్తేనే గెలుస్తారన్నారు.
రాజీవ్ కృష్ణ ఆంధ్రా షుగర్స్ వారసుల్లో ఒకరు. ఇటీవల మరణించిన కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణబాబు అల్లుడు. సంప్రదాయంగా టీడీపీలో ఉండేవారు.. కృష్ణబాబుకు చంద్రాబాబుతో విబేధాలు రావడంతో వైసీపీలో చేరారు. జగన్ ఆయన అల్లుడికి సలహాదారు పదవి ఇచ్చారు. ఇప్పుడు రాజీవ్ కృష్ణకు కూడా అక్కడ ఉక్కపోతే ఉందేమో కానీ కులాల్ని తిట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు. గత ఐదేళ్లుగా వైసీపీ కులద్వేష రాజకీయాలే చేసింది. అయినా రాజీవ్ కృష్ణకు గుర్తుకు రాలేదు. ఇప్పుడు విజయసాయిరెడ్డి అనే సరికి కోపం వచ్చింది. అప్పట్లో వైసీపీకి అధికారం ఉంది. ఇప్పుడు లేదు అంతే తేడా !