వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర… కిలోమీటర్ దూరంలోపు… బీటీ రోడ్డు నిర్మాణాన్ని అధికారులు చేపట్టారు. అంచనా వ్యయం రూ. కోటి తొంభై లక్షలు. ఇది కేవలం ఇరవై ఆడుగుల రోడ్డు మాత్రమే. స్టేట్ ఫైనాన్స్ గ్రాంట్తో శరవేగంగా.. ఈ రోడ్డును నిర్మించేస్తున్నారు. రెండు రోజుల్లో పూర్తి చేస్తున్నారు. గతంలో… తాడేపల్లిలోని రేవేంద్రపాడు నుంచి సీతానగరం వెళ్లే రోడ్డును విస్తరించేందుకు .. రూ.5 కోట్లు మంజూరు చేసింది. ఈ రోడ్డు నేషనల్ హైవేను తాడేపల్లి-నూతక్కి రోడ్డుతో కలుపుతుంది. 1.3 కి.మీ. పొడవైన ఈ రోడ్డు పక్కనే సీఎం నివాసం ఉంది. అయితే… ఇప్పుడు… రోడ్డు పక్కన ఉన్న భరత మాత విగ్రహం నుంచి.. జగన్ నివాసం ఉన్న కీర్తి ఎస్టేట్స్ వరకూ.. ఇరవై అడుగుల రోడ్డును.. తారురోడ్డుగా మారుస్తున్నారు. దీనికి రూ.కోటి 90 లక్షలు ఖర్చు చేస్తున్నారు.
ప్రభుత్వ ధనాన్ని ఇలా.. ప్రైవేటు ఆస్తుల వద్దకు మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు ఉపయోగించడంపై.. మొదటి నుంచి విమర్శలు వస్తున్నాయి. సీఎం జగన్ వ్యక్తిగత ఆస్తి అయిన ఇంట్లో.. తర్వాత ఇంట్లో ఎలక్ట్రికల్ స్విచ్ ల దగ్గర్నుంచి ఏసీ ల వరకూ .. ప్రజల సొమ్ముతోనే కొనుగోలు చేశారు. అక్కడా సెక్యూరిటీ ఏర్పాట్ల కోసం.. రూ. లక్షలు వెచ్చించారు. తాడేపల్లిలోని జగన్ ఇంటిపై.. ప్రభుత్వం ఇప్పటి వరకు .. రూ. పది కోట్లకుపైగానే ఖర్చు చేసిందని జీవోలు చెబుతున్నాయి. అలాగే.. హైదరాబాద్ లోటస్ పాండ్లోనూ భద్రతా ఏర్పాట్లు చేయడానికి ఏకంగా.. రూ. 24 లక్షల 50వేలు మంజూరు చేశారు.
పదే పదే విమర్శలు వస్తున్నప్పటికీ… జగన్ ఇంటి దగ్గర ఇలా …కోట్లకు కోట్లు పనులను శరవేగంగా కొనసాగిస్తున్నారు. ఆ కొంచెం రోడ్డుకు.. అన్ని కోట్లు ఎందుకు ఖర్చవుతాయన్న సందేహాలు వస్తున్నప్పటికీ.. అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రజాదర్భార్ నిర్వహిస్తామని ప్రకటించిన జగన్ దీని కోసం… మరో వేదిక నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. అది మరో రూ. రెండు కోట్ల వరకూ అవుతుందని అంచనా.