హైదరాబాద్లో ఇళ్లు కొనేవాళ్లు ఉన్నారు.. ఇళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ రియల్ ఎస్టేట్ కు మాత్రం గడ్డుకాలంల నడుస్తోంది. కరోనా తర్వాత మొదలు పెట్టిన ప్రాజెక్టులన్నీ ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తంగా ఓ లక్ష ఇళ్లు హైదరాబాద్లో అమ్మకానికి రెడీగా ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎంక్వయిరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ అత్యధిక గమంది వేచి చూద్దామన్న ఆలోచనలో ఉండటంతో డిమాండ్ మందకొడిగా ఉంది.
ముఖ్యంగా హైడ్రా చెరువులు, ప్రభుత్వ భూములపై అధికారికంగా పూర్తి స్పష్టత ఇస్తే.. మళ్లీ కొనుగోళ్లు ఊపందుకోవచ్చు. హైడ్రా ధాటికి ఇళ్ల బయ్యర్లు.. తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నుంచి మొదలు భారీ విస్తీర్ణంతో ట్రిపుల్, ఫోర్, ఫైవ్ బెడ్రూం అపార్ట్ మెంట్స్ కూడా ఉన్నాయి. కనీసంగా 1500 చదరపు అడుగుల నుంచి మొదలు 16000 చదరపు అడుగుల వరకు విస్తీర్ణంలో అపార్ట్ మెంట్స్, విల్లాలు నిర్మాణం పూర్తి చేసుకుని గృహ ప్రవేశానికి సిద్దంగా ఉన్నాయని రియల్టర్లు సోషల్ మీడియాలో కూడా ప్రకటనలు ఇస్తున్నారు.
భారీ నివాస ప్రాజెక్టులతో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చిన్న బిల్డర్లు నిర్మించిన స్టాండ్ లోన్ అపార్ట్ మెంట్స్, ఇండిపెండెంట్ ఇళ్లు అన్నీ కలిసి దాదాపు లక్ష ఇళ్ల వరకు నిర్మాణం పూర్తి చేసుకుని రిజిస్ట్రేషన్ కు రెడీగా ఉన్నాయి. గందరగోళ పరిస్థితుల్లో ఇంటి కొనుగోలు అంత మంచిది కాదని వేచిచూసే ధరణి అవలంబిస్తున్నారు గృహ కొనుగోలుదారులు. దీంతో హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాల్లో స్పష్టమైన తగ్గుదల కనిపిస్తోంది.
ఒకటి, రెండు నెలల్లో అంతా సర్దుకుంటుందని. ..డిసెంబర్ లో వడ్డీ రేట్లుకూడా తగ్గిస్తే డిమాండ్ ఒక్క సారిగా అమాంతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.