అతి తక్కువ సమయంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది యూవీ క్రియేషన్స్. ప్రభాస్ లాంటి స్టార్ ఈ సంస్థ వెనుక ఉండడం ప్లస్సయ్యింది. చిన్న సినిమాలు తీయడానికి యూవీ 2 పేరుతో మరో బ్యానర్ పెట్టారు వంశీ, ప్రమోద్‌లు. ఇప్పుడు యూవీ లో మరో సంస్థ పుట్టుకురాబోతోంది. అయితే ఈ సంస్థ కేవలం ప్రమోద్ చేతిలో మాత్రమే ఉండబోతోంది. ఓరకంగా చెప్పాలంటే ప్రమోద్‌కి ఇది సొంత కుంపటి లాంటిదన్నమాట. అయితే యూవీ 1, 2లలో ఆయన భాగస్వామ్యం మామూలుగానే ఉండబోతోందని టాక్. చిన్న, మీడియం రేంజ్ సినిమాలు ఈ వంశీ తన బ్యానర్ నుంచి తీస్తారట. యూవీ 1, యూవీ 2ల వెనుక ప్రభాస్ హస్తం ఉంది. అయితే వంశీ స్థాపిస్తున్న సంస్థలో.. ప్రభాస్ కి వాటా ఉందా, లేదా? అనేది తెలియాల్సివుంది. ప్రస్తుతం అనుష్క, నవీన్ పొలిశెట్టిలతో యూవీ క్రియేషన్స్ ఓ సినిమా చేస్తోంది. దానికి వంశీ, ప్రమోద్‌లు నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.