యూవీ క్రియేషన్స్ అంటే… కచ్చితంగా భారీ బడ్జెట్ సినిమానే. బడా హీరోలతో, భారీ చిత్రాలు తెరకెక్కిస్తూ, టాలీవుడ్ లోని అగ్ర నికమాణ సంస్థలలో ఒకటిగా మారింది. అయితే…. ఇటీవల చిన్న సినిమాలపైనా యూవీ దృష్టి పెట్టింది. అందులో భాగంగానే `ఏక్ మినీ కథ` వచ్చింది. అమేజాన్లో ప్రదర్శింపబడుతున్న ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. నిర్మాతలకూ భారీ లాభాలు గిట్టుబాటు అయ్యాయి.
ఏక్ మినీ కథ ఇచ్చిన స్ఫూర్తితో… యూవీ క్రియేషన్స్ మరో `బోల్డ్` కథతో.. సినిమా తీయబోతోందట. `ఏక్ మినీ కథ`కి మేర్లపాక గాంధీ కథని అందించాడు. ఈసారి కూడా మేర్లపాక గాంధీనే ఈ సినిమాకి కథ అందించబోతున్నాడట. ఓ కొత్త దర్శకుడ్ని ఈ సినిమాతో పరిచయం చేయబోతున్నారు. `ఏక్ మినీ కథ`లానే.. తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాని లాగించేసి, ఓటీటీ ద్వారా విడుదల చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే మేర్లపాక గాంధీ… యూవీకి లైన్ చెప్పేశాడట. ఇక.. స్క్రిప్టుగా మారడమే తరువాయి. యూవీ తీరు చూస్తుంటే, ఇంకొన్నాళ్లు చిన్న సినిమాలతో హోరెత్తించడం ఖాయంగా కనిపిస్తోంది.