ఒకప్పుడు సినిమాలో హీరో రెమ్యునరేషన్ మాత్రమే వామ్మో అనిపించేలా ఉండేవి.. కాని పరిస్థితి మారింది దర్శకులే సినిమాకు ఆఫ్ స్క్రీన్ హీరోలవుతున్నారు అందుకే వారికి కూడా హీరోలకు సరి సమానంగా రెమ్యునరేషన్ ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఫాంలో ఉన్న స్టార్ దర్శకులంతా కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారే. అయితే వీరు కోట్లు డిమాండ్ చేస్తున్నారంటే అది సరదాగా కాదు సినిమా తీస్తే హిట్టే అన్న పంథా వీరిది.
ప్రస్తుతం ఆ కోవలో రాజమౌలి, త్రివిక్రం ముందడుగు వేయగా అదే దారిలో తాను కూడా ఉన్నానంటూ చేరిపోయాడు కొరటాల శివ. మిర్చి , శ్రీమంతుడు సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కొరటాల శివ సినిమా తీస్తే హిట్టే అన్నట్టు ఉంది. తీసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా మలిచాడు కాబట్టి నిర్మాతలు కూడా కొరటాల శివకు భారీ పారితోషికం ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు.
ప్రస్తుతం ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తున్న కొరటాల శివ ఆ సినిమా కోసం పారితోషికంగా 10 కోట్లు తీసుకుంటున్నాడని అంటున్నారు. టాలీవుడ్లో 10 కోట్ల దర్శకులు చాలా తక్కువ వారిలో తన కూడా ప్లే దక్కించుకున్నాడు శివ. మైత్రీ మూవీ మేకర్స్ కొరటాల శివతో మూడు సినిమాల డీల్ కూడా కుదుర్చుకున్నాడని.. మూడు సినిమాలు కలిపి 30 కోట్ల ఒప్పదం అని అంటున్నారు. మొత్తానికి రెండు సినిమాలతో 10 కోట్ల క్లబ్లో చేరిపోయాడు కొరటాల శివ. మరి ఇదే పంథాని కొనసాగించి సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.