బాక్సాఫీసు దగ్గర అల వైకుంఠపురములో తన ప్రభావం చూపిస్తూనే ఉంది. సరిలేరు నీకెవ్వరుతో పోలిస్తే… బన్నీ సినిమాకే టికెట్లు ఎక్కువ తెగుతున్నాయి. చిత్రబృందం కూడా ప్రమోషన్లని ఎక్కడా ఆపడం లేదు. వీలైనప్పుడల్లా ఏదో ఓ ఈవెంట్ చేస్తూనే ఉంది. ఇప్పటికే రెండు మూడు సక్సెస్ మీట్లు నిర్వహించారు. ఇప్పుడు మరో ఈవెంట్ చేయబోతున్నారు.
శని లేదా ఆదివారాలలో అల వైకుంఠపురములో ఓ ఈవెంట్ ఉండబోతోంది. ఈసారి పంపిణీదారుల్ని పిలిచి వాళ్లని సన్మానించాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. అల వైకుంఠపురములోకి సంబంధించి ఇదే ఆఖరి ఈవెంట్ కూడా. మరోవైపు రెండో దఫా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. బన్నీ – త్రివిక్రమ్‌ల జోడీ ఈరోజు ప్రధాన దిన పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలకు స్వస్తి పలకాలని అటు బన్నీ, ఇటు త్రివిక్రమ్ భావిస్తున్నారు.