ఓ చిన్న పాయింటు పట్టుకుని, దానికి వినోదం జోడించి మినిమం గ్యారెంటీ సినిమాలు తీయడంలో మారుతి సిద్ధహస్తుడు. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినమాలతో డిజార్డర్ పాయింట్లకు ఫన్ జోడించాడు. ప్రతిరోజూ పండగే తో మారుతి బలం మరోసారి బయటపడింది. తదుపరి సినిమా కూడా ఆయన ఓ ఫ్యామిలీ డ్రామానే ఎంచుకున్నాడు. రామ్ తో మారుతి ఓ సినిమా చేయబోతున్నాడు. ఈసారి రామ్ ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి ఓటేసినట్టు టాక్.
నిజానికి రామ్ కోసం కూడా మారుతి ఓ వెరైటీ కాన్సెప్ట్ కథనే రాసుకున్నాడు. అయితే రామ్ మాత్రం `ప్రతిరోజూ పండగే` టైపు ఫ్యామిలీ డ్రామా చేద్దాం అన్నాడట. వెంటనే మారుతి కూడా అలాంటి కథని సిద్ధం చేసేశాడు. ఓ ఉమ్మడి కుటుంబం, అందులోని బంధాలు, వాటి మధ్య చక్కటి ఎమోషన్, ఎంటర్టైనర్ తో మారుతి ఓ కథ సిద్ధం చేశాడని, అది రామ్ కి కూడా బాగా నచ్చిందని తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ ఓ మాస్ సినిమా. ఇప్పుడు చేస్తున్న రెడ్ కూడా మాస్, యాక్షన్ కథే. అందుకే వాటి మధ్య ఉపశమనం కోసం ఫ్యామిలీ డ్రామాని ఎంచుకున్నాడన్నమాట. చూస్తుంటే కుటుంబ కథా చిత్రాలకు మారుతి నే పెద్ద దిక్కుగా మారేట్టు కనిపిస్తోంది.