‘రంగస్థలం’పాటలన్నీ బయటకు వచ్చేశాయి. ఇప్పటికే మూడు పాటల్ని విడుదల చేసిన చిత్రబృందం.. ఇప్పుడు మరో రెండు పాటల్నీ వినిపించేసింది. మొత్తంగా ఈసినిమాలో 5 పాటలున్నాయి. అయితే మరో పాట దాచారు. ఈ పాటని గీత రచయిత చంద్రబోస్ రాసి, స్వయంగా ఆలపించాడు. ఈనెల 18న జరిగే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఈ పాటని చంద్రబోస్ స్వయంగా పాడి వినిపించబోతున్నాడు. 18న విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈకార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతాడు. దేవిశ్రీ ప్రసాద్ లైవ్ షో ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ సందర్భంగానే ఆరో పాటనీ వినిపించబోతున్నారు. ఈనెల 29న రంగస్థలం విడుదల కాబోతోంది. రామ్చరణ్, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు.