విశాఖకు చెందిన వైసీపీ నేతల మళ్ల విజయ్ ప్రసాద్‌కు చెందిన వెల్ఫేర్ గ్రూప్ ఏపీలోనూ పలు చోట్ల డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసింది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఈ సంస్థపై సీబీఐ కేసులు .. ఇతర చీటింగ్ కేసులు నమోదు కావడంతో మళ్ల విజయ్ ప్రసాద్ ను పలుమార్లు అదుపులోకి తీసుకోవడం.. అరెస్ట్ చేయడం చేశారు. అయితే ఏపీలో ఇంకా కేసులు నమోదు కాలేదు. కానీ వేల్ఫేర్ గ్రూప్ వసూలు చేసిన డిపాజిట్లు మాత్రం చెల్లించడం లేదు. గతంలో నెల్లూరులో వేల్ఫేర్ గ్రూప్ ఆఫీసు మూసి వేసింది. అప్పుడు డిపాజిటర్లు, ఏజెంట్లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.
కానీ ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. తమను మోసం చేశారని పోలీస్ స్టేషన్ వద్దకు డిపాజిటర్లు వెళ్లినా కేసుల్లేవు. తాజాగా గుడివాడలోనూ ఆ కంపెనీ కార్యాలయం మూసివేశారు. డిపాజిట్లు మెచ్యూర్ అయిన వారికి డబ్బులు చెల్లించడం లేదు . దీంతో ఏజెంట్లు, డిపాజిట్ దారుల గుండెల్లో రాళ్లు పడ్డాయి. వారు ధర్నాలకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు కావడం లేదు. దాంతో ఏం చేయాలో తెలియక వారు నానా తంటాలు పడుతున్నారు. వేల్ఫేర్ గ్రూప్ ఓనర్ వైసీపీ నేత కావడంతో కేుసలు నమోదు చేయడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
వైసీపీ నేత అయి అయితే మోసం చేయవచ్చా అని వేల్ఫేర్ గ్రూప్ డిపాజిటర్లు మథనపడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో పోలీసులు వారికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిందితుల్ని అరెస్ట్ చేసి.. రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం దానికి రివర్స్‌లో డరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.