‘వన్’ సినిమా గురించి మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పటికీ మాట్లాడుకొంటుంటారు. మిగిలిన ఫ్యాన్స్ కీ, మహేష్ ఫ్యాన్స్ కీ విషయంపై ఎడతెగని చర్చ సాగుతూనే ఉంటుంది. ‘వన్ హిట్’ అని మహేష్ అభిమానులు.. ‘కాదు’ అని మిగిలినవాళ్లు చర్చించుకొంటూనే ఉన్నారు. ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాతో నష్టాలొచ్చాయని.. స్వయానా ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ క్లారిటీ ఇచ్చాడు. ‘లై’ ఆడియో ఫంక్షన్‌కి ఒకానొక అతిథిగా వచ్చాడు సుకుమార్. ‘లై’, ‘నేనొక్కడినే’ రెండూ 14 రీల్స్ చిత్రాలే. ఆ సంస్థ గొప్పదనం గురించి వివరిస్తూ.. ”వన్ తో తమ అభిరుచిని చాటుకొన్నారు. ఆసినిమాతో నష్టాల్నీ చూశారు. అయినా తమ ఫ్యాషన్ వదల్లేదు” అంటూ 14 రీల్స్‌ని పొగిడే పనిలో.. తన సినిమా ఫ్లాప్ అయ్యిందని తేల్చేశాడు. ‘వన్’ ఇంటెలిజెంట్ సినిమా అనీ, ఆ సినిమా హిట్టే అని వాదిస్తున్న మహేష్ ఫ్యాన్స్ ఈ దెబ్బకు కామ్ అయిపోవడం ఖాయం. అయితే.. తన సినిమా వల్ల నష్టాలొచ్చాయని బహిరంగంగానే స్టేట్ మెంట్ ఇవ్వడం సుక్కు గట్స్ కి నిదర్శనం. ఈ విషయంలో మాత్రం అందరి మనసుల్నీ గెలుచుకొన్నాడు సుకుమార్.