జగన్ రెడ్డికి సపోర్టు చేసే ప్రత్యేకమైన వర్గ మీడియా ఇప్పుడు ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వ్యతిరేకించడజం చిన్న పదం.. అసహ్యించుకుంటోంది. ఆయన ఓ చేతకాని రాజకీయ నేత అని.. లాటరీ సీఎం అని ప్రతీ రోజూ సర్టిఫికెట్లు ఇస్తోంది. పోలింగ్ తర్వాత కూడా జగన్ రెడ్డి ఘోరంగా ఓడిపోతారని చెప్పింది. ఎన్నికలకు ముందు జగన్ కోటరీలో బందీ అయ్యారని… పిచ్చి పిచ్చి సర్వేలు వేసుకుంటున్నారని.. ఆయనను ఆయన మోసం చేసుకుంటున్నారని… ఆయన చుట్టూ ఉన్న సలహాదారులు మోసం చేస్తున్నారని చెప్పుకొచ్చింది.
ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఆ డోస్ ను మరింతగా పెంచింది. ఆ వర్గ మీడియాకు జగన్ పై అంత కోపం ఎందుకు వస్తుందో అన్న డౌట్ ఇప్పుడు వైసీపీ నేతల్లోనే కనిపిస్తోంది. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఆ లవర్గ నేత వైసీపీకి చాలా సహకారం ఇచ్చారు. కానీ జగన్ గెలిచిన తర్వాత వేరే డిజిటల్ మీడియా ఓనర్ని చంకలో పెట్టుకున్నారు. ఈ మీడియా నేతను అసలు పట్టించుకోలేదు. చివరి వరకూ ఏదో ఆశించినా… ప్రయోజనం లేకపోయింది. అందుకే అసంతృప్తికి గురయ్యారని అంటున్నారు.
ముఖ్యంగా తనకు జగన్ దగ్గరకు యాక్సెస్ లేకుండా చేసిన సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆ వర్గ మీడియా ఓనర్ కు తీవ్ర అసంతృప్తి ఉందని ఆ రాతలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆయన వల్లే పార్టీ నాశనం అయిందని అయినా జగన్ పట్టించుకోవడం లేదని బాధపడుతున్నారు. సజ్జలను దూరం పెట్టాలని రోజూ రకరకాలుగా కథనాలు రాయిస్తున్నారు. సజ్జలను పక్కన పెట్టే వరకూ జగన్పై ఇలా ఈ వర్గ మీడియా అసహ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది.