భారత రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగా చాలా కాలం పని చేసింది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రతిపక్షంగా మాత్రం పని చేయలేదు. పదేళ్ల పాటు తిరుగులేని అధికారం అనుభవించిది. తమ చేతి నుచి జారిపోదనుకున్న అధికారం జారిపోవడంతో నిరాశ నిస్ప్రహలకు గురైంది. ఇది జరిగి ఏడాది అవుతోంది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో వాష్ అవుట్ అయిపోయారు. అసెంబ్లీకివ ప్రధాన ప్రతిపక్ష నేత రావడంలేదు. కేటీఆర్, హరీష్ రావు ఫీల్డ్‌లో పోరాడేందుకు వ్రయత్నం చేస్తున్నారు.
ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్కు కొత్తదేం కాకపోవచ్చు.. ఉద్యమం అంతా ప్రతిపక్షంగా చేశారని అనుకోవచ్చు. కానీ ఆ ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు మాత్రం రెస్ట్ లో ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ను కేటీఆర్ నడుపుతున్నారు. అందుకే బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర కొత్తగా పోషిస్తోంది. కొత్త మార్గంలో వెళ్తోంది. ఎక్కువగా సోషల్ మీడియాపై దృష్టి కేంద్రీకరిస్తోంది. సోషల్ మీడియాలో అజెండాను సెట్ చేసుకుని దాన్ని ఫీల్డ్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇది మంచిదా కాదా అన్నది బీఆర్ఎస్ పెద్దలకే తెలియాలి.
అయితే బీఆర్ఎస్ పెద్దల్లో మాత్రం ఫీల్డ్ లో పోరాటం కన్నా సోషల్ మీడియాలో చేసేప్రచారం వల్ల ఎక్కువ లాభం ఉంటుందన్న అభిప్రాయం ఉంది. అందుకే ఫీల్డ్ పోరాటాల కన్నా ఆన్ లైన్ పోరాటాలను ఎక్కువగా ప్లాన్ చేసుకుంటున్నారు. కొన్ని ఇతర వర్గాలు చేసే పోరాటాలను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసినా వికటించాయి. ఆటోడ్రైవర్ల ధర్నాకు వెళ్లినప్పుడు అదే జరిగింది.
బీఆర్ఎస్ ఇంకా ప్రతిపక్షంగా నాలుగేళ్లు గడపాల్సి ఉంది. ఆ పార్టీ ఓటు బ్యాంక్ ను మెల్లగా కైవసం చేసుకునేందుకు బీజేపీ రెడీగా ఉంది. ఆ పని చాపకింద నీరులా చేసుకుంటోంది. పార్లమెంట్ ఎన్నికల్లో దీనికి పునాది పడింది. బీజేపీ ముందు ముందు బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేయనుంది. కాంగ్రెస్ తో పోరాడుతూ.. తమను ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తున్న. బీజేపీని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ ఎంతో చేయాల్సి ఉంది.