ఎన్నికల కమిషన్ నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కమిషన్ నియామకానికి ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ ప్యానెల్లో ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి ఉండాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు చాలా మందిని ఆకర్షించింది. దీనికి కారణం రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ .. పూర్తిగా వన్ సైడ్ గేమ్ ఆడుతోంది. ఇటీవలి కాలలో ఇది మరీ ఎక్కువ అయింది. దీంతో ఎన్నికల ఫలితాలు మారిపోతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
“శేషన్” లాంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మళ్లీ ఎందుకు రాలేదు ? అని గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఆశ్చర్యపోయింది. ఎన్నికల నిర్వహణ సమయంలో సుప్రీం. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించి దేశానికి అచ్చమైన ప్రజా ప్రభుత్వాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఈసీపై ఉంది. . ఎన్నికల కమిషన్కు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వ్యవస్థ మొత్తం అదుపులో ఉంటుంది. ఎన్నికలు స్వేచ్చగగా జరగడానికి ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తమను నియమించిందని.. వారికి అనుకూలంగా వ్యవహరించడం తమ ధర్మమని అనుకునే కమిషనర్లతో సమస్యలు ఏర్పడ్డాయి.
శేషన్ లాంటి ఫియర్ లెస్.. నిస్వార్థమైన అధికారులు.. ఎన్నికల సంఘాన్ని లీడ్ చేస్తే.. దేశ ప్రజాస్వామ్యాన్ని అంత కంటే మరి ఏ శక్తి బలోపేతం చేయలేదు. ఎందుకంటే.. ప్రజాస్వామ్యాన్ని ఎన్నికలే ప్రాణం. ఈసీ, సీఈసీలను పారదర్శకంగా నియమించడానికి ప్రతిపక్ష నేతకు, సీజేఐకు స్థానం కల్పించడంతో ఇక ముందు అయినా సిన్సియర్ ఎన్నికల కమిషనర్లు వస్తారనే ఆనందం ప్రజాస్వామ్య వాదుల్లో కనిపిస్తోంది.