ఏపీ కేబినెట్లో నేడు ఆర్టీసీ విలీనంపై నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి సంబంధించి… ఆర్టీసీ విలీనంపై సీఎంకు అధ్యయన కమిటీ నివేదిక సమర్పించింది. ఆంజనేయరెడ్డి కమిటీ నివేదిక విలీనం విధివిధానాలపై పలు మార్గదర్శకాలతో నివేదికఅందించింది. ఐదు మార్గాలు సూచించినట్లుగా చెబుతున్నారు. ఆర్టీసీ విలీనం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని… అందుకే… ముందుగా.. ఆర్టీసీ ఉద్యోగుల్ని.. ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తే చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కేబినెట్ లో ఆమోద ముద్ర వేస్తే.. ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బంది మారుతారు. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అనే కార్పొరేషన్ ఉద్యోగులుగా ఉన్నారు.
ఆర్టీసీని సర్కారులో విలీనం చేసేద్దాం అని మంత్రులు, సీఎం జగన్ పట్టుబట్టారు. అయితే.. ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బందిని మాత్రమే తీసుకోగలమమని సంస్థను మాత్రం విలీనం చేయడం ఇప్పట్లో సాధ్యం కాదని కమిటీ సభ్యులు వారికి వివరించారు. అడ్డంకులేమిటో జగన్ కు.. కమిటీ వివరించింది. నిజానికి ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కాలేదు. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వ వాటా 39 శాతం ఉంది. దానికితోడు విభజన వల్ల తెలంగాణ, ఏపీల వాటా ఎంతో ఇంకా తేలలేదు. రెండు రాష్ట్రాలూ కలసి కేంద్రం వాటాను తేల్చాల్సి ఉంటుంది. ఆప్పుడే.. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యమవుతుంది. దీన్నే.. అతి కష్టం మీద జగన్కు.. మంత్రులకు .. కమిటీ సభ్యులు వివరించినట్లుగా తెలుస్తోంది.
ఉద్యోగులను మాత్రమే… సంస్థలో విలీనం చేయడం అంటే.. ప్రభుత్వంపై.. రూ. మూడు వేల కోట్ల అదనపు బారం పడుతుంది. ప్రత్యేకంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసి.. అందులో ఉద్యోగులుగా భావించాలి. దీనిపై ఆర్డినెన్స్ జారీ చేసి… పదిహేను రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీలో ప్రస్తుతం 53వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ప్రయోజనాలన్నీ పొందుతారు. కానీ ఆర్టీసీ సంస్థ మనుగడకు మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు.