జగన్ రెడ్డి చేసింది మహా పాతకమని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తేల్చారు. అంతే రాజకీయ నాయకులు వ్యూహాత్మకంగా చేసినట్లుగా ఆయన దేవుడిని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. అదేమిటంటే.. తిరుమలను అపవిత్రం చేసిన వారిని శిక్షించాల్సింది దేవుడేనని అంటున్నారు. దేవుడు తనను అపవిత్రం చేసిన వారిని శిక్షించకపోతే…మరోసారి భయమే ఉండదని.. గుడిని కూడా మింగేస్తారని హెచ్చరికలు కూడా జారీ చేశారు.
దేవుడు అన్నీ చూస్తూంటాడు. ఎప్పుడు ఎవర్ని ఎలా శిక్షించాలో అలా శిక్షిస్తాడు. తనకు చేటు చేశారని ద్వేషం పెంచుకోవడానికి ఆయన మనిషి కాదు. తనకు లోటు చేశారని ఇన్స్టంట్గా శిక్షించేయాలనుకునే దేవుడు కాదు. ఆర్కే ఈ లాజిక్ మిస్సయ్యారు. లడ్డూ పాతకానికి పాల్పడిన వారికి వీలైనంత శిక్ష వేయాలని శ్రీవారికి తన సలహాగా ఇచ్చారు. నిజానికి జగన్ రెడ్డి ఇప్పుడు అనుభవిస్తున్నదంతా శిక్షనే. ఐదేళ్ల పాటు చేసిన ఒక్క శ్రీవారి విషయంలోనే కాదు.. తనకు ఓట్లేసిన ఓటరు దేవుళ్ల ను సైతం అవమానించిన ఆయనకు ఇప్పుడు అనుభవిస్తున్న శిక్ష చిన్నది కాదు. మానసికంగా చిక్కిపోతూ. ఏం చేస్తున్నాడో తెలియని స్థితికి పోతున్న ఆయనకు ఇప్పుడు శిక్ష పడుతున్నట్లే లెక్క.
దేవుడు ఎవరినీ శిక్షించడు. తన పాతకాలు, పాపాల ద్వారా జగన్ లాంటి వాళ్లు తమను తాము శిక్షించుకుటూ ఉంటారు. ఇప్పుడు జగన్ రెడ్డికి ఎవరున్నారు ?. తల్లి, చెల్లి కూడా లేరు. ఆయన పక్కన ఉంటే ఏమైనా లాభం ఉంటుందని అనుకున్నవారే ఉంటున్నారు. అలాంటి వారు కూడా పట్టుమని పది మంది లేరు. ఎప్పుడైనా తమకు ముప్పు ఉందని తెలిస్తే వారు కూడా మరుక్షణంలో కనుమరుగవుతారు. జగన్ రెడ్డి ఇప్పుడు ఎలా చూసినా ఒంటరి.
లడ్డూ పాతకంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. త్వలో చట్ట పరంగా కూడా శిక్షలు ఉంటాయి. ఆర్కే తన ఆర్టికల్ లో ఐదేళ్ల పాటు జగన్ రెడ్డి అండ్ కో శ్రీవారిని ఎలా మార్కెటింగ్ చేసుకున్నారో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ దేవదేవుడికి అన్నీ తెలుసు. ప్రజలకూ తెలుసు కాబట్టే.. పాతాళంలోకి పడేశారు.