కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఎలా ఉంటారన్న దానిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హైలెట్ అవుతున్నాయి. కేసీఆర్ సీఎంగా ఉండటం కన్నా ప్రతిపక్ష నేతగా ఉండటమే కాంగ్రెస్ పార్టీకి డేంజర్ అన్నారు. అలాంటి కేసీఆర్ రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోమన్నారు. కాంగ్రెస్కు కేసీఆర్ ఎంత డేంజర్ అవుతారన్న సంగతి పక్కన పెడితే.. కేసీఆర్ పూర్తిగా రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండబోతున్నారని కేటీఆర్ స్పష్టమైన హింట్ ఇచ్చారు.
భారత రాష్ట్ర సమితి పరాజయం తర్వాత కేసీఆర్ చేయబోయే రాజకీయంపై అనేక విశ్లేషణలు వచ్చాయి. కేసీఆర్ చాలా కాలంగా తెలంగాణలో పార్టీ వ్యవహారాలను పూర్తిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అప్పగించారు. కేసీఆర్ పూర్తిగా పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరించడంపైనే దృష్టి పెట్టారు. కేసీఆర్కు సహాయంగా కవిత ఉంటున్నారు. రేవంత్ రెడ్డి సభానాయకుడిగా ఉంటే.. తాను ప్రతిపక్ష నేతగా ఉండటం ఆయనకు ఇష్టం లేదని అనుకున్నారు.
ప్రజాస్వామ్యం, రాజకీయాల్లో ఉండే ప్రత్యేకత అదే. ఇప్పుడు పాత్రలు రివర్స్ అయ్యాయి. మళ్లీ రాజకీయంగా పుంజుకోవాలంటే… రేవంత్ రెడ్డిపై పోరాడి ప్రజల అభిమానాన్ని మళ్లీ పొందడమే మార్గం. ఆ మార్గాన్ని కేటీఆర్ కు అప్పగించడం కన్నా.. తానే తీసుకుంటనే ఎక్కువ ప్రబావం ఉంటుందని కేసీఆర్ నమ్ముతున్నారని అనుకోవచ్చు. కేటీఆర్ కూడా ఇవే సంకేతాలు పంపుతున్నారు.