ఒకవేళ సూపర్‌స్టార్ కృష్ణ బయోపిక్ చేస్తే… అందులో హీరోగా ఎవరు నటిస్తే బాగుంటుంది? ఈ ప్రశ్న ఎవర్ని అడిగినా మరో సందేహం లేకుండా కృష్ణ తనయుడు మహేశ్‌బాబు పేరే చెబుతారు. ఎవరికైనా సందేహాలు వుండి వుంటే ‘భరత్ అనే నేను’తో తీరాయని చెప్పక తప్పదు. అందులోని ఒక పాటలో మహేశ్ మీసాలు పెట్టుకుంటే అందరి నోటా ఒక్కటే మాట… అచ్చం కృష్ణలా వున్నారని! ‘భరత్ అనే నేను’లో మహేశ్ ప్రమాణ స్వీకారం వాయిస్ టీజర్ విడుదల చేస్తే జనాలు కృష్ణ వాయిస్ అనుకున్నారు. తనయుడికి తండ్రి డబ్బింగ్ చెప్పాడని చాలామంది భావించారు. ఇన్ని పోలికలు కనిపిస్తున్నప్పుడు కృష్ణ బయోపిక్ మహేశ్ కాకుండా మరొకరు చేస్తే బాగుంటుందా? బాగోదు కదా!
కృష్ణ సతీమణి విజయనిర్మల కూడా ఆ మాటే అంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో కృష్ణ బయోపిక్ గురించి ఆమె మాట్లాడుతూ “కృష్ణగారిన ఇమిటేట్ చేయడం కష్టం. ఆయన అందం, సాఫ్ట్‌నెస్ ఎవరికీ రాదు. ఒకవేళ ఆయన బయోపిక్ చేస్తే మహేశ్ చేయాలి” అని తెలిపారు. కృష్ణ నటించిన సినిమాలను రీమేక్ చేయడానికి కూడా మహేశ్ బాబు ఒప్పుకోరు. క్లాసిక్ సినిమాలను టచ్ చేయకపోవడమే బెటర్ అంటుంటారు. అటువంటిది తండ్రి బయోపిక్ చేస్తారంటారా? వెయిట్ అండ్ సి. ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలకృష్ణ నటిస్తున్నారు. తండ్రి పాత్రను చేస్తున్నారు. కృష్ణ బయోపిక్‌లో ఆయన తనయుడు మహేశ్ నటించాలని విజయనిర్మల, అభిమానులు కోరుకోవడంలో తప్పు లేదు కదా!!