చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లు ఎక్కువ. ఇందులో ‘హిట్’ కాంబినేషన్ ఒకటి. సినిమా హిట్ అయితే చాలు. మరో లాజిక్ అలోచించకుండా అదే కాంబినేషన్ రిపీట్ గా పడుతుంటుంది. కొంచెం నెగిటివ్ ట్రాక్ రికార్డ్ వున్న స్టార్లను, టెక్నిషియన్స్ ను పెట్టుకోవాలన్నా ఎక్కడో చిన్న టెన్షన్ ఉటుంది. ఇప్పుడు ఈ టెన్షనే మహేష్ బాబు ‘స్పైడర్’ ను వెంటాడుతుంది.
మహేష్ బాబు – మురగదాస్ కలయికలో ఓ భారీ చిత్రం రూపుదిద్దుకుటుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చుసిన అభిమానులకు ఇటివలే ఫస్ట్ లుక్ , టైటిల్ తో ఖుషి చేశాడు సూపర్ స్టార్. స్పైడర్ టైటిల్ తో వచ్చిన ఈ ఫస్ట్ లుక్ అదరగొట్టేసింది. టైటిల్ పోస్టర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అంతాబావుంది కానీ సెంటిమెంట్ విషయానికి వస్తే.. చిత్ర సంగీత దర్శకుడు హ్యారీష్ జయరాజ్ తన ట్రాక్ రికార్డ్ తో భయపడుతున్నాడు.
హ్యారీష్ జయరాజ్ ఇప్పటివరకూ తెలుగులో అరడజను పైగా సినిమాలు చేసుంటాడు. ఇందులో ఒక్క హిట్ లేదు. మ్యూజిక్ బావుండదా ? అంటే ఆల్బమ్ సూపర్ హిట్ అవుతుంటుంది. అరేంజ్ డిజాస్టర్. మ్యూజిక్ మాత్రం బ్లాక్ బస్టర్. మహేష్ బాబు ‘సైనికుడు’ చిత్రానికి హ్యారీష్ నే మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా ఫలితం అందరికీ తెలిసిందే. అయితే మురగదాస్ కి బాగా కలిసొచ్చిన సంగీత దర్శకుడు హ్యారీష్ . అందుకే మహేష్ సినిమా కూడా ఆయన్నే పెట్టుకున్నాడు. అయితే సెంటిమెంట్ ప్రకారం ట్రాక్ రికార్డ్ మాత్రం నెగిటివ్ గా వుంది. మరి ఈసారి ఆ నెగిటివ్ సెంటిమెంట్ ను హ్యారీష్ తుడిచేయాలనే కోరుకుందాం.