బోయపాటి శ్రీను మీద ఓ ముద్ర పడిపోయింది.యాక్షన్ సినిమాల్నీ డోసు పెంచి తీసే దర్శకుడని పేరడిపోయింది. సింహా, దమ్ము.. ఇప్పుడు సరైనోడె చూస్తే బోయపాటి లోని యాక్షన్ యాంగిల్ మా బాగా అర్థమైపోతుంది. బోయపాటి సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కాస్త దూరమైంది అందుకే. కానీ.. బోయపాటి ఈసారి స్టైల్ మార్చబోతున్నాడట. యాక్షన్ డోసు తగ్గించి… ఫ్యామిలీ ఆడియన్స్ ని సైతం ఆకట్టుకొనే ప్రయత్నాలు మొదలెట్టాడని టాక్.
సరైనోడు తరవాత బోయపాటి శ్రీను.. బెల్లంకొండ శ్రీనివాస్‌తో జత కట్టబోతున్న సంగతి తెలిసిందే. మేలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. తన శైలికి భిన్నంగా ఓ పూర్తి స్థాయి ప్రేమకథ తీయబోతున్నాడట బోయపాటి. ఈసారి ఫైట్లను బాగా తగ్గించేశాడని టాక్. ఈ సినిమాలో ఉండేవి రెండే రెండు ఫైట్లట. అదీ.. ఇంట్రవెల్‌కి ముందూ.. క్లైమాక్స్‌లో మాత్రమేకనిపిస్తాయని తెలుస్తోంది. అయితే ఆ రెండు ఫైట్లు మాత్రం బోయపాటి తన శైలిలో దట్టంగా భారీ స్థాయిలో తీస్తాడట. పోనీలెండి.. బోయపాటిలో ఈమాత్రం మార్పయినా వచ్చింది. మున్ముందు ఇంకాస్త డోసు తగ్గించుకొంటూ వెళ్తే.. అందరూ చూడదగిన సినిమాల్ని అందివ్వడం ఖాయం.