ఈమధ్య కాలంలో సందీప్ కిషన్ నుంచి పూర్తిగా పాజిటీవ్ బజ్‌లో విడుదల అవుతున్న సినిమా.. ‘ఊరి పేరు భైరవకోన’. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలకు ముందే ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ దక్కించుకొంది. డిజిటల్, శాటిలైట్ రూపంలో మంచి రేట్లు దక్కాయి. ఈనెల 16న విడుదల చేస్తున్నారు. అయితే ఒక్క రోజు ముందే.. అంటే 14న ప్రేమికుల రోజు సందర్భంగా పెయిడ్ ప్రీమియర్లు ప్లాన్ చేసింది నిర్మాత. ఏపీ, తెలంగాణలలో దాదాపు 75 స్క్రీన్స్‌లో ఈ ప్రీమియర్లు ప్రదర్శించబోతున్నారు. చివరి నిమిషంలో ధియేటర్లు కూడా పెంచే అవకాశం ఉంది. ఓ మీడియం రేంజు సినిమాని ఈ స్థాయిలో ప్రీమియర్లు వేయడం అరుదైన విషయమే.
ఇదో సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే కథ. ధ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉండబోతున్నాయని చిత్రబృందం చెబుతోంది. విరూపాక్ష, హనుమాన్ లాంటి చిత్రాలు ఇవే జోనర్లో వచ్చి విజయవంతమయ్యాయి. అందుకే ‘భైరవకోన’పై బయ్యర్లకు నమ్మకం పెరిగింది. సందీప్ కిషన్ కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడు. తన కెరీర్లో ఇదో మరపురాని సినిమా అవుతుందని నమ్మకంగా చెబుతున్నాడు. అన్నట్టు సీక్వెల్ కి సైతం ఈ సినిమాలో ఛాన్స్ ఉందట. పార్ట్ 2కి సంబంధించిన లీడ్ ఈ సినిమా చివర్లో ఇచ్చారని తెలుస్తోంది.