హైదరాబాద్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్ బేస్లోపలికి దూరిన పాకిస్తాన్ టెర్రరిస్టులు ఇంకా పూర్తిగా అంతమొందినట్లు లేదు. ఇవాళ ఉదయం కూడా ఎయిర్‌బేస్ లోపలినుంచి పేలుళ్ళు, తుపాకీ కాల్పుల మోతలు వినిపిస్తున్నాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) దళాలు, సైనికల కదలికలు కనిపిస్తున్నాయి. వీరు రాకెట్ లాంచర్స్, మోర్టార్ గన్స్ ఇతర అత్యాధునిక ఆయుధాలతో ఎయిర్ బేస్ లోపలికి వెళ్ళటం కనిపించింది. ఇద్దరు టెర్రరిస్ట్‌లు లోపల ఉన్నట్లు భావిస్తున్నారు. గత రాత్రి, ఈ తెల్లవారుఝామున కూడా అప్పుడప్పుడూ పేలుళ్ళు, తుపాకీ కాల్పుల మోతలు వినిపించాయి. టెర్రరిస్టులకోసం భద్రతాదళాలు తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలుస్తోంది. హెలికాప్టర్లను కూడా ఉపయోగిస్తున్నారు.
శనివారం ఉదయం ఉగ్రవాదుల దాడి ప్రారంభమయింది. ఇప్పటివరకు ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక పౌరుడు, ఏడుగురు సైనిక సిబ్బంది చనిపోయారు. మరోవైపు భద్రతాదళాల గాలింపు ఆపరేషన్ ఇవాళకూడా కొనసాగేటట్లు కనబడుతోంది.