నిప్పులేనిదే పొగ రాదన్నట్లు … చంద్రబాబుకు నోటీసుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. నటుడు శివాజీ.. ప్రెస్మీట్ పెట్టి ప్రత్యేకంగా చెబితే హైలెట్ అయింది కానీ.. కొద్ది రోజులుగా రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న అంశమే ఇది. ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో ఏదో ఒక లొసుగు పెట్టుకుని.. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే పని.. ప్రధానమంత్రి మోడీ… తను పదవి చేపట్టి నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తూనే ఉన్నారు. జీ హూజూర్ అన్న బడా బడా ఆర్థిక నేరస్తులు.. ధైర్యంగా బయట తిరుగుతూంటే.. ఒకే కేసుకు.. నాలుగైదు సార్లు జైలు శిక్షకు గురి కావాల్సిన పరిస్థితి లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి కరుడుగట్టిన బీజేపీ నేతలకు ఎదురయింది. ప్రాంతీయ పార్టీల నేతల్ని.. ముఖ్యంగా దక్షిణాది ప్రాంతీయ పార్టీల నేతలందర్నీ… బీజేపీకి దగ్గర చేసేందుకు.. మోడీ సీబీఐనే రాయబారిగా వాడుతున్నారు.
ఒడిషాలో.. ఓ చిట్ ఫండ్ స్కాంలో.. బీజేడీ నేతల్ని ఇరించేసిన.. సీబీఐ… వాటిని తీసుకెళ్లి మోడీ చేతిలో పెట్టింది. అక్కడ బీజేపీ… తన చాప కిందకు నీరు తెస్తున్నా..నవీన్ పట్నాయక్ చచ్చినట్లు బీజేపీకే పదే పదే మద్దతు ప్రకటించాల్సి వస్తోంది. ఓ రాష్ట్రంలో తన ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న పార్టీకి ఏ సీఎం అయినా గులాం అంటాడా..?. మంచి చేసినా.. తప్పు చేశాడని రంకెలు వేయరా..? కానీ నవీన్ పట్నాయక్ మాత్రం మోడీ తప్పు చేసినా… మంచే చేశారని పొగుడుతున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ది కూడా అలాంటి సీబీఐ లింకే. కాంగ్రెస్ హయాంలో.. ఒకప్పుడు కార్మిక మంత్రిగా చేసి.. వెలగబెట్టిన ఘనకార్యాన్ని మోడీ.. ప్రధాని కాగానే బయటకు తీశారు. ఓ ఫైన్ మార్నింగ్ సీఎం క్యాంపాఫీస్కు అధికారుల్ని పంపించి నట్లు బిగించారు. ఆ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. కానీ అప్పట్నుంచి కేసీఆర్ తీరే మారిపోయింది. బీజేపీ చేతిలో కీలబొమ్మ అయిపోయారు. ఇక డీఎంకేకు.. టూజీ కేసు బిస్కెట్ వేశారు. డీఎంకేను లైన్లో పెట్టుకోవడానికే..ఇప్పుడు తమిళనాడులో అన్నాడీఎంకే మంత్రులపై సీబీఐ దాడులు చేస్తున్నారు. ఎందుకంటే.. గుట్కా స్కామట. తమిళనాడు పోలీసులు చూసుకోవాల్సిన దానికి.. ఏకంగా సీబీఐని దించేశారన్నమాట. ఇక జగన్కు కేసుల నత్త నడక స్వీట్ తినిపిస్తున్నారు.
అందర్నీ ఎలాగోలా లైన్లో పెట్టుకున్నారు. కానీ చంద్రబాబే లొంగనిది. అందుకే ఎప్పుడు… ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారో.. అప్పట్నుంచే.. సీబీఐ పేరుతో… బెదిరింపులు ప్రారంభించారు. ఒకరు పట్టిసీమ అంటారు… ఇంకొకరు పీడీ అకౌంట్లు అంటారు.. ఇంకొకరు.. ఉపాధి హామీ నిధులంటారు. ఇంకొకరు.. పోలవరం అక్రమాలంటారు…మరోకరు మరింత దిగజారిపోయి.. శ్రీవారి నగలంటారు.. ఎవరి నోట విన్నా.. సీబీఐ విచారణమాటే. అవి మాటలే కాదు.. అంతర్గతంగా కొన్ని వ్యవహారాలు కూడా జరిగాయని.. ఢిల్లీ నుంచి వస్తున్న తాజా సమాచారం. పట్టిసీమ కాంట్రాక్టర్ కు జాతీయ స్థాయిలో కొన్ని కాంట్రాక్టులిచ్చి.. చంద్రబాబుకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ మీద ఇప్పటికే సంతకాలు తీసుకున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక కొత్త కొత్త కోణాలేమున్నాయో కానీ.. చంద్రబాబుకు జాతీయ విచారణ సంస్థల నుంచి నోటీసులైతే కచ్చితంగా వస్తాయని… బీజేపీ నేతలే చెబుతున్నారు. మరి ఈ ఆపరేషన్ గరుడ.. ఎ మలుపులకు కారణం అవుతుందో..!?