అధికార పక్షం అప్పుడే దాడి మొదలుపెట్టింది. తాననుకున్నది సాధించడం కోసం ఏకంగా ప్రతిపక్షం రాష్ట్రపతి కోసం తమ అభ్యర్థిగా నిర్ణయించిన మీరా కుమార్పైనే విమర్శలు ఎక్కుపెట్టింది. 2013లో స్పీకర్గా ఉండగా మీరా కుమార్ వ్యవహరించిన శైలిని వివరించే వీడియోను కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. ఆరు నిముషాల వ్యవధిలో తనను మాట్లాడనీయకుండా 60సార్లు అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తాను ప్రసంగిస్తుండగా..ప్లీజ్ కంక్లూడ్ అంటూ ఆమె పదేపదే అడ్డుకున్నారని సుష్మ తెలిపారు. కుంభకోణాలపై మాట్లాడుతుండడమే దీనికి కారణమన్నారు. ప్రభుత్వ కుంభకోణాలపై ప్రసంగిస్తుండగా తటస్థంగా వ్యవహరించాల్సిన స్పీకర్, దారుణంగా ప్రవర్తించారనేది సుష్మ ఆరోపణ. తటస్థంగా వ్యవహరించలేని వ్యక్తి రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి ఎలా అర్హురాలని కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు.
అధికార పక్షం ఇలా దాడికి దిగడం వెనుక కారణమేమిటి? ఇద్దరు అభ్యర్థులకు నడుమ లక్షా 50 వేల లోపు విలువైన ఓట్ల వ్యత్యాసమేనా. అధికార పక్షాన్ని ఇదే గందరగోళ పెడుతోందా? మైండ్ గేమ్ ఆడాలని బీజేపీ భావిస్తోందా. రాష్ట్రపతి పదవి ఎన్నికను సైతం గబ్బుగబ్బు చేయాలని రెండు పక్షాలు నిర్ణయించేసుకున్నట్లే. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నోరు మూసుక్కూర్చోదు కదా.
https://twitter.com/SushmaSwaraj/status/878885165816098816
This is how Lok Sabha Speaker Meira Kumar treated the Leader of Opposition – https://t.co/hxHWHaJ4D9
— Sushma Swaraj (@SushmaSwaraj) June 25, 2017
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి