విశాఖకు మంత్రుల కార్యాలయాలు తరలించేందుకు మిలీనియం టవర్స్ ను కేటాయిస్తే సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. వైసీపీ నేతలు ప్రచారం చేయడం పాలనా రాజధానిని విశాఖకు తరలిస్తున్నామని. ప్రజలకూ అదే చెబుతున్నారు. కానీ జీవోలు ఏమి చెప్పారు.. ఉత్తరాంధ్ర అబివృద్ధిపై జగన్ రెడ్డి సమీక్షలు చేయాడనికి వెళ్తున్నారు కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలను మారుస్తున్నారట. సమీక్షలు చేయడానికి కార్యాలయాలు కూడా మార్చాలా అని ఎవరికైనా వస్తే.. మార్చి తీరాల్సిందే అని ప్రభుత్వం చెబుతుంది. ఎందుకంటే… హిడెన్ అజెండా ఉంది మరి.
ఫేక్ కారణాలతో ఉత్తర్వులిచ్చే సర్కార్
రాజధాని అంశం సుప్రీంకోర్టులో ఉంది. ఏదైనా న్యాయబద్దంగా చేయడం… చేసేదాన్ని ప్రజలకు చెప్పడం ప్రభుత్వ విధి. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎన్నుకుంది ప్రజలు. వాళ్లేం చేస్తున్నారో నిజాయితీగా ప్రజలకు చెప్పాలి. కార్యాలయాలను తరలించి కోట్ల సొమ్ము వృధా చేయడం కాదు.. న్యాయవ్యవస్థను సైతం అవమానిస్తున్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు. తప్పుడు పేర్లు పెట్టి.. కార్యాలయాలను తలిస్తున్నారు. అంత అవసరం ఏముంది ? ప్రభుత్వం ఎవర్ని మోసం చేయాలనుకుంటోంది ?
ప్రజలకు నిజాలు చెప్పలేని ఫేక్ సర్కార్
రాజధాని అంశం జగన్ రెడ్డితో వైసీపీదో కాదు .. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం. రాజధాని కోసం త్యాగం చేసిన రైతులకు సంబంధించిన అంశం.. అలాంటప్పుడు ఫేక్ పాలనతో… ఫేక్ కారణాలతో ఏదో చేయడం అంటే.. ఘోరమైన తప్పిదమే. ఇలా చేయడం వల్ల సీఎం జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ కు విశాఖలో ఉన్న ఆస్తుల విలువ కొంత పెరుగుతుందేమో కానీ… రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర సంపద కొన్ని లక్షల కోట్లు నష్టపోవాల్సి ఉంటుంది. గత నాలుగున్నరేళ్లుగా అదే జరుగుతోది. ఇప్పుడు మరోసారి అదే చేస్తున్నారు.
నాలుగున్నరేళ్లుగా అదే తప్పుడు పాలన
మూడు రాజధానులు అని ప్రకటించి ఇప్పటికి నాలుగేళ్లు దాటిపోయింది. ఇంత వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. అడ్డగోలుగా తెచ్చిన జీవోలు.. చేసిన చట్టాలను కూడా ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇంత ఘోరంగా ఫెయిలైనా ఇంకా తప్పుడు మార్గాల్లో ఏదో చేయాలనుకుంటున్నారు. దీని వల్ల పది లక్షల కోట్ల ప్రజా సంపద అయిన అమరావతి ఆవిరి ఆయిపోయింది. ఈ అనిశ్చితి వల్ల ప్రజలు ఇంకెంత నష్టపోయారో చెప్పాల్సిన పని లేదు. ఇందుకేనా ప్రజలు అధికారం ఇచ్చింది. నాలుగురున్నరేళ్లుగా ప్రతీ దాంట్లోనూ అంతే తప్పుడు ఉద్దేశాలతో ఉత్తర్వులు ఇవ్వడం.. తాము అనుకున్నది చేయడం.