రాజ్ తరుణ్ నటించిన చిత్రం `ఒరేయ్ బుజ్జిగా`. మాళవికా నాయర్, హెబ్బా పటేల్ కథానాయికలు. కొండా విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. థియేటర్లు లేకపోవడంతో ఓటీటీలో విడుదల చేశారు. ఆహాలో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో విడుదల కాబోతోంది. జనవరి 1న ఈ చిత్రాన్ని థియేటర్లలోనూ విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. అందుకు ఏర్పాట్లూ మొదలెట్టింది. ఆహాలో ఎక్కువ మంది చూసిన సినిమాల్లో `ఒరేయ్ బుజ్జిగా` ఒకటి. థియేటర్లలో విడుదల చేస్తే.. మరింత మందికి చేరువ అవుతుంన్నది నిర్మాతల నమ్మకం. పైగా.. ఈరోజు నుంచి తెలంగాణలో థియేటర్లు తెరిచారు. కానీ… ఆడించుకోవడానికి ఏ సినిమా సిద్ధంగా లేదు. అందుకే ఓటీటీలో ఆడేసిన కొన్ని సినిమాల్ని ఇప్పుడు థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. అందులో భాగంగా `ఒరేయ్.. బుజ్జిగా` కూడా విడుదల అవుతోంది. మరి కొన్ని సినిమాలు ఒరేయ్ బుజ్జిగా బాటలో.. థియేటర్లలో విడుదల కానున్నాయి.