ఆంధ్రప్రదేశ్‌లో మత మార్పిళ్లు గత రెండేళ్ల నుంచి చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి. దళితులందర్నీ.. క్రిస్టియన్లుగా మార్చే మిషన్ అమలు జరుగుతోందని… జాతీయ సంస్థలు కూడా నివేదికలు ఇచ్చాయి. వాటిపై విచారణచేయాలని అనేక మంది ఫిర్యాదులు చేయడం..ఆ ఫిర్యాదుల్నిఏపీ సర్కార్కే పంపడం కామన్ అయిపోయింది. అసలు ప్రభుత్వ పెద్దలే మత మార్పిళ్ల వెనుక ఉన్నారన్న ఆరోపణలతో.. ఆ విచారణలు జరిగే చాన్స్ కానీ.. జరిగినా.. నిర్దిష్టమైన నిజాలు బయటకు వచ్చే అవకాశం కానీ లేదు. అయితే.. బీజేపీ భావజాలం … దీనికి పూర్తి విరుద్ధం. కానీ వైసీపీతో బీజేపీ చెట్టాపట్టాలేసుకుని రాజకీయం చేస్తోంది.అదే సమయంలో ఆరెస్సెస్ .. జగన్మోహన్ రెడ్డి పాలనా తీరు.. మత మార్పిళ్లు.. ఇతర అంశాలపై విరుచుకుపడుతోంది. ఆరెస్సెస్ అభిప్రాయమే.. బీజేపీ అభిప్రాయం అనే మాట జగన్ విషయంలో నిజం కావడం లేదు.
ఆరెస్సెస్‌కు ఆర్గనైజర్ అనే పత్రిక ఉంది. ఆ పత్రిక ద్వారా ఆరెస్సెస్.. దేశంలో జరుగుతున్న పరిణామాలపై అభిప్రాయాలను వెల్లడిస్తుంది. భిన్నంగా ఉన్న వాటిని అసలు ప్రచురించదు. వీక్లీమ్యాగజైన్ అయిన ఆర్గనైజర్‌లో జగన్మోహన్ రెడ్డిపై… తాజాగా సంచికలో ఓ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించారు. జగన్ మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని.. రాజ్యాంగ హక్కులు అన్నింటినీ ఉల్లంగించేశారని తేల్చారు. సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై దాడి చేశారని… రేపు రాష్ట్రపతి, ప్రధానిని అయినా టార్గెట్ చేస్తారని.. చివరికి న్యాయవ్యవస్థపైనా దాడి చేస్తారని రాసుకొచ్చారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి న్యాయవ్యవస్థపై దాడి చేయడం ఎప్పుడో ప్రారంభమయింది. ప్రధాని మోడీపై.. తాను భయభక్తులు ఉన్నట్లుగా జగన్ కనిపిస్తారు కానీ.. తన పార్టీ నేతలతో అవసరమైనప్పుడల్లా తిట్టిస్తూనే ఉంటారు. వీటన్నింటిపై ఆర్గనైజర్ రచయితకు అవగాహన లేనట్లుగా ఉంది.
జగన్ పై ఆర్గనైజర్ వ్యతేరిక కథనం రాయడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఓ సారి.. ఇలాంటి కథనమే రాశారు. “తుగ్లకీ జగన్” పేరు పెట్టి.. మూడు రాజధానుల నిర్ణయం దగ్గర్నుంచి అనేక అంశాలపై విమర్శలు గుప్పించారు. అయితే.. ఆరెస్సెస్ అభిప్రాయాలను బీజేపీ పరిగణనలోకి తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డికే ఢిల్లీ నుంచి సపోర్ట్ లభించింది. మూడురాజధానుల నిర్ణయానికి మద్దతు పలికారు. దీంతో ఆరెస్సెస్ .. బీజేపీ అభిప్రాయాలు ఒక్కటి కాదని తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డిపై ఆరెస్సెస్ కు ఎంత వ్యతిరేక అభిప్రాయాలున్నా… బీజేపీ పెద్దలకు సన్నిహితుడయినందున.. ఆయనకు వచ్చే నష్టమేమీ లేదు. ఆయన మిషన్ ఆయన కొనసాగిస్తూనే ఉంటారని.. ఆరెస్సెస్ మద్దతుదారులు నిట్టూరుస్తున్నారు.