కేంద్రప్రభుత్వం నిన్న ప్రకటించిన ఒకే హోదా-ఒకే పెన్షన్ పధకంలో వివిధ కారణాలతో స్వచ్చందంగా పదవీ విరమణ (వీ.ఆర్.యస్.) చేసిన సైనికులకు వర్తించదని మొదటపేర్కొన్నప్పటికీ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొన్నట్లుంది. ఫరీదాబాద్ లో ఆదివారంనాడు జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ “సైన్యంలో వీ.ఆర్.యస్. తీసుకొన్నవారికీ ఇఏ పధకం వర్తిస్తుంది. దీనిపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దీని కోసం కేవలం రూ.500 కోట్లు కేటాయించి చేతులు దులుపుకొంది.కానీ మా ప్రభుత్వం దీనిపై లోతుగా అధ్యయనం చేసి రూ.10, 000 కోట్లు కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్లలో చేయలేనిది మా ప్రభుత్వం కేవలం 16నెలల్లో అమలుచేసి చూపించింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని మాజీ సైనికులే త్రిప్పి కొట్టాలి,” అని అన్నారు.
వీ.ఆర్.యస్. విషయంలో కూడా కేంద్రప్రభుత్వం మాజీ సైనికుల డిమాండ్స్ అంగీకరించింది. కనుక గత 84 రోజులుగా డిల్లీలో నిరాహార దీక్షలు చేస్తున్న మాజీ సైనికులు తమ దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు. కానీ మిగిలిన డిమాండ్లపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉంటామని తెలిపారు.