ఒకప్పటి అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ కుటుంబ సభ్యులు ముగ్గురు నిన్న రాత్రి విమాన ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో లాడెన్ తల్లి, సోదరి, సోదరి భర్తతో బాటు విమాన పైలెట్ కూడా మృతి చెందినట్లు బ్రిటన్ పోలీసులు దృవీకరించారు. వారు ముగ్గురు తమ స్వంత జెట్ విమానంలో ఇటలీలోని మిలన్ నగరం నుండి బ్రిటన్ లోని హామ్ప్ షైర్ నగరానికి వస్తున్నప్పుడు వారు ప్రయాణిస్తున్న విమానం బ్లాక్ బుష్ విమానాశ్రంలో దిగుతున్న సమయంలో అకస్మాత్తుగా పక్కనే ఉన్న కార్ల వేలం వేసే కంపెనీ మీద కూలిపోయింది. విమానం కూలిపోగానే పెద్దగా మంటలు ఎగిసిపదినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ప్రమాదంపై బ్రిటన్ దర్యాప్తు మొదలుపెట్టింది.