కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉస్మానియా క్యాంపస్ కార్యక్రమం రద్దయింది. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు వ్యహాత్మకంగా వివాదాం లేవనెత్తడంతో.. ఉస్మానియాలో విద్యార్థి గర్జన చేసి… యువతను ఆకట్టుకోవాలనుకున్న కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశలకు బ్రేక్ పడినట్లయింది. నిజానికి రాహుల్ గాంధీ ఓయూ క్యాంపస్ కు రాకుండా చేయడానికి.. ఒక్క టీఆర్ఎస్ విద్యార్థి విభాగం మాత్రమే అడ్డు చెప్పింది. మరో 17 విద్యార్థి సంఘాలు.. రాహుల్ రాకను స్వాగతించాయి. దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఎవరికైనా ఉంటుందని.. రాహుల్ ను అడ్డుకుంటామనడం సరికాదని…వాదించాయి. ఈ మేరకు ఆ విద్యార్థి సంఘాల నేతలే.. వైఎస్ చాన్సలర్ కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ టీఆర్ఎస్వీ ఆందోళనతో .. శాంతిభద్రతల సమస్య వస్తుందన్న వీసీ అనుమతిని నిరాకరించారు.
క్యాంపస్ లోని టాగోర్ అడిటోరియంలో.. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించాలనుకున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పుడీ కార్యక్రమాన్ని క్యాంపస్ బయట వేరే ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నారు. ఉస్మానియాలో రాహుల్ పర్యటిస్తే.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. కాంగ్రెస్ పై యువతలో సెంటిమెంట్ పెరుగుతుందన్న భావన టీఆర్ఎస్ నేతలు వచ్చినందునే.. రాహుల్ ను . ఓయూకు రాకుండా చేశారని.. కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టు లాంటి ఉస్మానియాలో… ఒకప్పుడు టీఆర్ఎస్ నేతలకు తప్ప.. ఇతరులకు ఎంట్రీ ఉండేది కాదు. వెళ్తే ఎక్కడ దాడులు జరుగుతాయోనన్న భయం ఉండేది. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ నేతలకు ఆ పరిస్థితి ఉంది. చెప్పినట్లుగా ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో యువతలో తీవ్ర అసంతృప్తి ఉందన్న ప్రచారం జరుగుతోంది.
యువతలో ఉన్న ఈ అసంతృప్తిని తమ పార్టీకి అనుకూలంగా మరల్చుకునేందుకు కాంగ్రెస్ ఓయూని వేదికగా చేసుకోవాలనుకుంది. కానీ వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ పెద్దలు.. తమ పార్టీ విద్యార్థి విభాగాన్నిరంగంలోకి దించారు. ఎలాగూ .. నిర్ణయం తమ చేతల్లోనే ఉంటుంది కాబట్టి… విద్యార్థి నేతలను అందుకోసం ఓ కారణంగా చూపించుకున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం క్యాంపస్లో కాకపోతే.. బయట అయినా విద్యార్థులతో సమావేశం నిర్వహిస్తామంటోంది.